‘వెంకీమామ’ అండ్‌ టీమ్‌ రెడీ అవుతోంది! | Venkatesh, Naga Chaitanya’s Telugu comedy to hit floors in February | Sakshi
Sakshi News home page

వేసవిలో మొదలు

Published Thu, Jan 31 2019 1:38 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Venkatesh, Naga Chaitanya’s Telugu comedy to hit floors in February - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

మార్చిలో మొదలు పెట్టడానికి ‘వెంకీమామ’ అండ్‌ టీమ్‌ రెడీ అవుతోంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డి. సురేష్‌బాబు ఓ నిర్మాత. ఇందులో నాగచైతన్యకు జోడీగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తారు. ఇంతకుముందు ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో చైతన్య, రకుల్‌ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక వెంకీ సరసన శ్రియ లేదా తమన్నా నటించే అవకాశం ఉందని తెలిసింది.

ఈ ఇద్దరి హీరోయిన్లతో సినిమాలు చేశారు వెంకీ. అసలు... ఈ సినిమా ఈపాటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది కానీ వెంకటేశ్‌ కుమార్తె పెళ్లి  వేడుక ఉండటంతో సినిమాను మార్చిలో స్టార్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారట టీమ్‌. అయితే ఒకసారి షూటింగ్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత వీలైనంత తొందరగా కంప్లీట్‌ చేసి ఈ ఏడాదే ‘వెంకీమామ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట టీమ్‌. ఇక ఈ సినిమాలో రియల్‌లైఫ్‌లో మాదిరిగానే మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు వెంకీ అండ్‌ చైతూ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement