ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌తో వెంకీ-చైతూ | Venky Mama Title Consider for Venkatesh Naga Chaitanya Multi Starrer | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 1:38 PM | Last Updated on Mon, Jun 4 2018 1:38 PM

Venky Mama Title Consider for Venkatesh Naga Chaitanya Multi Starrer - Sakshi

వరుసగా రెండు మల్టీస్టారర్‌ చిత్రాలకు సిద్ధమై టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు అగ్ర హీరో వెంకటేశ్‌ దగ్గుబాటి. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌ 2 చిత్రంలో వరుణ్‌తేజ్‌తో, మరోవైపు పవర్‌ ఫేమ్‌ బాబీ(కె.యస్‌. రవీంద్ర) డైరెక్షన్‌లో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడు. చైతూ చేయబోతున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగా నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారంట. పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాబీ రూపొందించబోతున్నాడంట. అందుకే టైటిల్‌ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్‌బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్‌ తేజ్‌ల ఎఫ్‌ 2 ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement