నారదుడుగా ధనుష్ | Dhanush New Film Named Naradudu | Sakshi
Sakshi News home page

నారదుడుగా ధనుష్

Published Tue, Jun 7 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

నారదుడుగా ధనుష్

నారదుడుగా ధనుష్

 ‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’, ‘నవ మన్మథుడు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ హీరో ధనుష్. తమిళంలో ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ దాదాపు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. తాజాగా మరో చిత్రం రానుంది. ధనుష్, శ్రీయ, జెనీలియా ప్రధాన పాత్రల్లో జోహార్ దర్శకత్వంలో సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘నారదుడు’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. రేష్మ, కరిష్మా సమర్పణలో ఉమ (సైదాపురం) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
 
  ఈ సందర్భంగా నిర్మాత ఉమ మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగువారికి అవసరమైన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, విజయ్ ఆంటోని సంగీతం, భువనచంద్ర పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement