మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనడిగితే... కొందరి పేర్లు చెబుతాం. శ్రియకు కూడా అలా చెప్పడానికి ఓ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ‘సాహసం’ కూడా ఉంటుంది. అవును.. అడ్వెంచర్ నా ఫ్రెండ్ అంటారు శ్రియ. అందుకే వీలు కుదిరినప్పుడల్లా నేస్తానికి దగ్గరగా వెళతారు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. విదేశాల్లో అడ్వంచర్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీకి స్కూబా డైవింగ్ అంటే ఇష్టం. అందుకే స్కూబా డైవింగ్ కోర్స్‌తో పాటు, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కోర్స్‌లను ఆమె కంప్లీట్ చేశారట.
విక్రమ్ హీరోగా తెలుగులో వచ్చిన ‘మల్లన్న’ సినిమాలోని ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న..’సాంగ్‌లో ఆమె అండర్‌వాటర్ సీన్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఇండోనేషియాలోని బాలీలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. దానికి సంబంధించిన ఫొటోను శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఫస్ట్ సన్‌రైజ్ నా ఫేస్‌ను టచ్ చేస్తున్నప్పుడు సముద్రంలో బ్యూటిఫుల్ డైవ్ చేస్తున్నాను.
సముద్రంలో ఇలా చేయడం ఇట్స్ ఎ మ్యాజికల్’’ అని పేర్కొన్నారు శ్రియ. చూశారుగా... నీటి లోపల ఏమాత్రం భయం లేకుండా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చేయాలంటే ధైర్యం ఉండాలండి బాబు. శ్రియ డేరింగ్ అండ్ డ్యాషింగ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘నరకాసురుడు’, ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో శ్రియ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment