
ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో..!
సీనియర్ హీరోయిన్ శ్రియ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటి కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. అయితే ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న ప్రతీసారి ఏదో ఒక సినిమాతో తిరిగి సత్తా చాటుతున్న శ్రియ, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది.
ఇప్పటికే బాలకృష్ణ వందో సినిమాగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటి. తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఖైదీ నంబర్ 150లో కూడా ఈ బ్యూటి ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాలో శ్రియ ఓ స్పెషల్ సాంగ్లో అలరించనుంది. గతంలో చిరు హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో మెగాస్టార్కు జోడిగా నటించిన శ్రియ మరోసారి చిరుతో కలిసి చిందేసేందుకు రెడీ అవుతోంది.