Rashmi Gautam High Remuneration for Item Song in Chiranjeevi Bhola Shankar Movie - Sakshi
Sakshi News home page

Rashmi-Chiranjeevi: రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గని రష్మీ, ఎన్ని లక్షలో తెలుసా?

Published Wed, Dec 8 2021 7:48 PM | Last Updated on Wed, Dec 8 2021 8:12 PM

Rashmi Gautam Remuneration Goes Viral For Chiranjeevi Bhola Shankar Movie - Sakshi

Rashmi Gautam Remuneration Goes Hot Topic In Chiranjeevi Bhola Shankar Movie Special Song: బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తొలుత వెండితెరపై సహానటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ ప్రముఖ కామెడీ షోతో తనకంటూ నేమ్‌, ఫేమ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’.

చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్‌ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్‌ గిఫ్ట్స్‌

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్‌ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్‌ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్‌ సాంగ్‌ చేయడమంటే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్‌ విషయంలో ఏమాత్రం తగ్గలేదట.

చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్‌..!

ఈ ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్‌ ఆఫర్‌ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్‌ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. 

చదవండి: ప్రముఖ యూట్యూబ్‌ స్టార్‌ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement