
‘ఏ జాలే లేని మరణం నేనే. ఏ పాపం లేని ప్రళయం నేనే’ అంటూ ‘ధృవ’ సినిమాలో సిద్ధా్దర్థ్ అభిమన్యు క్యారెక్టర్‌లో స్టైలిష్ విలన్‌గా అదరగొట్టారు అరవింద్ స్వామి. ఈ సినిమాలో రామ్‌చరణ్ ధృవ క్యారెక్టర్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కార్తీక్ నరేన్ దర్వకత్వంలో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ, ఇంద్రజిత్ ముఖ్యపాత్రల్లో ‘నరగాసురన్’ అనే చిత్రం రూపొందు తోంది. తెలుగులో ‘నరకాసురుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి ధృవ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సెప్టెంబర్ 16న స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను బుధవారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ షూట్‌లో అరవింద్ స్వామి బిజీ.