బాలయ్యకు జోడిగా మరోసారి..?
గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మోస్ట్ క్రేజీ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ, పూరిలు అభిమానుల కోసం ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం కోటీ 50 లక్షల రూపాయలతో భారీ సెట్ నిర్మించారు.
ఇప్పటికే బాలయ్యకు జోడిగా ముస్కాన్ అనే ముంబై భామను సెలెక్ట్ చేయగా.. లీడ్ హీరోయిన్గా సీనియర్ స్టార్ శ్రియను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు పలు హిట్ చిత్రాల్లో బాలయ్యకు జోడిగా నటించిన శ్రియ మరోసారి నందమూరి అందగాడితో ఆడిపాడనుంది. ప్రస్తుతానికి ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో ముస్కాన్ పాల్గొంటుండగా.. నెక్ట్స్ షెడ్యూల్లో శ్రియ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.