అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది! | 'Shriya in wonderland' of Kochi Biennale | Sakshi
Sakshi News home page

అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది!

Published Mon, Feb 16 2015 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది!

అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది!

ఒక మంచి పెయింటింగ్‌ని చూసినప్పుడు ఎవ్వరికైనా సరే అందమైన అనుభూతి కలుగుతుంది. ఇక కళలను ప్రేమించేవారికైతే ఆ అనుభూతి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. శ్రీయ కూడా ఈ జాబితాలో చేరతారు. రవివర్మ పెయింటింగ్స్ అంటే ఈ సుందరాంగికి చాలా ఇష్టం. ఆ మాటకొస్తే, మంచి బొమ్మ ఎవరు గీసినా అభినందిస్తుంటారామె. అడపా దడపా శ్రీయ కూడా కుంచె పడుతుంటారు. చిత్రకళ మీద ఉన్న మమకారం ఇటీవల ఆమెను కేరళ వరకూ తీసుకెళ్లింది. ప్రతి ఏటా అక్కడ ‘కొచ్చి ముజిరిస్ బియెన్నల్’ పేరుతో చిత్రకళల పండగ జరుగుతుంటుంది. ఈ పండగకు వేదికగా నిలిచిన అస్పిన్‌వాల్ హౌస్‌ని శ్రీయ సందర్శించారు. అక్కడ రకరకాల వర్ణ చిత్రాలను వీక్షించారు. ఆ సమయంలో ఓ అద్భుత ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపించిందని శ్రీయ పేర్కొన్నారు. ఇక్కడి చిత్రాల అందం గురించి మాటల్లో వర్ణించలేననీ, కళకు భాష లేదనీ ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement