Ravi Varma paintings
-
ఇది నిజమే కదా! కళ్లను నమ్మలేకున్నాం
రాజా రవివర్మ కుంచెపట్టాడంటే అది తిరుగులేని అద్భుత కళాఖండంగా మారాల్సిందే. ఆనాటి చిత్రకారుడు గీసిన చిత్రాలు కొద్ది క్షణాలపాటు రెప్పవేయకుండా చూడాల్సిందే. అచ్చంగా రవివర్మ గీసిన చిత్రాల్లా మారిపోయారు నేటితరం తారలు. రవివర్మ బొమ్మల పక్కన ముద్దుగుమ్మలు బుట్టబొమ్మల్లా తయారై పెయింటింగ్‌ను మరిపించేలా ఫొటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాను ఊపేస్తున్నాయి. అలనాటి హీరోయిన్ సుహాసిని మహిళా సాధికారతే లక్ష్యంగా నామ్ అనే చారిటబుల్ ట్రస్ట్‌ను నడిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘నామ్’ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానించింది. సుహాసినికి 12 మంది హీరోయిన్లతో క్యాలెండర్ తయారు చేయాలని ఆలోచన తట్టింది. అయితే ఈ క్యాలెండర్‌లోని చిత్రాలు ఆషామాషీగా కాకుండా రవివర్మ పెయింటింగ్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండాలని భావించింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్, విజువల్ ఆర్టిస్ట్ వెంకట్ రామ్ ఆమె ఆలోచనకు తోడయ్యాడు. అంతే.. సమంత, శృతిహాసన్ వంటి పలువురు హీరోయిన్లతో రవివర్మ గీసిన చిత్రాలను పున: సృష్టించారు. ఈ ఫొటో షూట్లో మంచు లక్ష్మి, ఖుష్బూ, ఐశ్వర్యారాజేశ్ కూడా పాల్గొన్నారు. వీరిని చూసిన అభిమానులు నటీమణుల అందాలకు అబ్బురపడిపోతున్నారు. రవివర్మ చేయి నుంచి జాలువారిన చిత్రాల్లా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే అచ్చుగుద్దినట్లుగా రవివర్మ ఫొటోలు కావాలంటే అదేమంత సులువు కాదు. వారి వేషధారణలోనే కాదు, ముఖంలోనూ జీవం ఉట్టిపడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా, విమర్శల పాలవడం తథ్యం. కానీ అలాంటి పెయింటింగ్‌కు పోటీగా తీసిన ఫొటోల్లో హీరోయిన్లతోపాటు ఫొటోగ్రాఫర్ సైతం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. సమంత ఫొటో అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉంది. ఇక శృతి హాసన్ రెండు పెయింటింగ్స్‌కు(రెండు నెలలకు గానూ) ఫొటోలు దిగడం విశేషం. ఇంకెందుకాలస్యం, క్యాలెండర్ విడుదల కన్నా ముందే మీరూ ఆ చిత్రాలను చూసేయండి. -
నీరవ్ మోదీ గుండె పగిలే వార్త
సాక్షి, ముంబై: పీఎన్బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ గుండెలు బద్దలయ్యే వార్త ఇది. దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారిని గత వారం లండన్‌లో స్కాట్లాండ్ పోలీసులకు చిక్కి, బెయిల్ రాక జైల్లో ఉన్న నీరవ్‌మోదీకి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. మోదీకి చెందిన ఖరీదైన కళాకృతులను ఆదాయ పన్నుశాఖ వేలం వేసింది. ముంబైలో మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో రాజా రవివర్మ పెయింటింగ్ ఏకంగా 16.10 కోట్ల రూపాయలకు అమ్ముడు బోయింది. దాదాపు అన్నీ అంచనాకు మించి ధర పలకడం విశేషం. మొత్తం 54. 84 కోట్ల రూపాయల సొమ్మును త్వరలోనే కోర్టుకు సమర్పించనుంది ఐటీ శాఖ. 173 విలువైన పెయింటింగ్స్, 11 వాహనాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ) వేలానికి ముంబై స్పెషల్ కోర్టు అనుమతిని పొందాయి. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం... తనకు రావల్సిన రూ.95.91 కోట్ల పన్ను బకాయిలకు సంబంధించి ఐటీ శాఖ 68 పెయింటింగ్స్‌ను వేలం నిర్వహించగా సరియైన ధర లభించక 13 అమ్ముడు పోలేదు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ వేలంలో జొగెన్ చౌదురీ పెయింటింగ్ రూ.46 లక్షల ధర అమ్ముడయింది. దీనికి రూ.18 లక్షలు విలువ అంచనా వేశారు. ఎఫ్.ఎన్ సౌజా 1955 ఇంక్ ఆన్ పేపర్‌కు రూ.32 లక్షలు పలికింది. అంచనా విలువ రూ.12 లక్షలతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువ. వి.ఎస్. గైటోండె 1973 ఆయిల్ పెయింటింగ్ ధర ఏకంగా రూ.25.24 కోట్లు. అలాగే వేలంలో విక్రయమైన పెయింటింగ్స్‌లో కే లక్ష్మాగౌడ్, అక్బర్ పదంసే, రీనా కల్లత్, అతుల్ డోదియా, గుర్చరణ్ సింగ్, హెచ్ఏ గాదే వంటి కళాఖండాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఫ్యుజిటివ్ డైమండ్ వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13వేల కోట్ల ముంచేసి లండన్‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీపై సీబీఐ,ఈడీ కేసులను నమోదు చేసింది. అలాగే పలు ఆస్తులతో పాటు, లగ్జరీ కార్లు, అత్యాధునిక వాహనాలు, విలువైన పెయింటింగ్‌లను కూడా ఎటాచ్ చేసింది. అలాగే మోదీ పాస్‌పోర్టును రద్దు చేసిన కేంద్రం తిరిగి అతడిని భారత్‌కు రప్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో లండన్‌లో నీరవ్‌మోదీని అరెస్ట్ చేసిన పోలీసులు మార్చి29 వరకు రిమాండ్‌కు తరలించిరు. మరోవైపు ఆయన మొదట బెయిల్ పిటీషన్‌ను వెస్ట్‌మినిస్టర్ కోర్టు తిరస్కరించిన నేపథ్యలో రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నాడు. -
అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది!
ఒక మంచి పెయింటింగ్‌ని చూసినప్పుడు ఎవ్వరికైనా సరే అందమైన అనుభూతి కలుగుతుంది. ఇక కళలను ప్రేమించేవారికైతే ఆ అనుభూతి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. శ్రీయ కూడా ఈ జాబితాలో చేరతారు. రవివర్మ పెయింటింగ్స్ అంటే ఈ సుందరాంగికి చాలా ఇష్టం. ఆ మాటకొస్తే, మంచి బొమ్మ ఎవరు గీసినా అభినందిస్తుంటారామె. అడపా దడపా శ్రీయ కూడా కుంచె పడుతుంటారు. చిత్రకళ మీద ఉన్న మమకారం ఇటీవల ఆమెను కేరళ వరకూ తీసుకెళ్లింది. ప్రతి ఏటా అక్కడ ‘కొచ్చి ముజిరిస్ బియెన్నల్’ పేరుతో చిత్రకళల పండగ జరుగుతుంటుంది. ఈ పండగకు వేదికగా నిలిచిన అస్పిన్‌వాల్ హౌస్‌ని శ్రీయ సందర్శించారు. అక్కడ రకరకాల వర్ణ చిత్రాలను వీక్షించారు. ఆ సమయంలో ఓ అద్భుత ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపించిందని శ్రీయ పేర్కొన్నారు. ఇక్కడి చిత్రాల అందం గురించి మాటల్లో వర్ణించలేననీ, కళకు భాష లేదనీ ఆమె తెలిపారు.