బాహుబలి వెబ్‌ సిరీస్‌లో స్టార్ హీరోయిన్‌ | Senior Heroine Shriya In Baahubali Web Series | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 14 2018 1:13 PM | Last Updated on Wed, Nov 14 2018 2:26 PM

Senior Heroine Shriya In Baahubali Web Series - Sakshi

బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్‌. అందులో భాగంగా బాహుబలికి  ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మిస్తున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం కానున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దేవా కట్టా, ప్రవీణ్‌ సత్తారులతో పాటు మరో బాలీవుడ్‌ దర్శకుడు పని చేయనున్నట్టుగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement