
క్రికెటర్‌తో డేటింగ్?
క్రికెట్ ప్లేయర్లతో సినిమా తారలు ప్రేమలో పడటం కొత్త విషయం కాదు. గతంలో పటౌడీని షర్మిలా ఠాగూర్ ప్రేమించి
క్రికెట్ ప్లేయర్లతో సినిమా తారలు ప్రేమలో పడటం కొత్త విషయం కాదు. గతంలో పటౌడీని షర్మిలా ఠాగూర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అజారుద్దీన్, సంగీతా బిజలానీ ప్రేమ వివాహం చేసుకుని, కొన్నేళ్ల తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యువరాజ్ సింగ్-హజల్ కీచ్, విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ కూడా డేటింగ్ చేస్తూ, వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో శ్రీయ కూడా చేరారు. ఈ ఢిల్లీ బ్యూటీ తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఎఫైర్ల పరంగా వార్తల్లో నిలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
వచ్చే నెల విడుదల కానున్న హిందీ చిత్రం ‘తుమ్ బిన్ 2’ ప్రమోషనల్ వీడియో షూట్‌లో పాల్గొనడానికి డ్వేన్ ఇండియా వచ్చారు. ముంబైలో చిత్రీకరణ జరిగింది. ఈ షూటింగ్‌కీ, శ్రీయకూ సంబంధం లేదు. అందుకే డ్వేన్‌తో ఆమె ఓ హోటల్‌లో కలసి లంచ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ హోటల్ నుంచి బయటికొస్తుంటే.. ఫొటోగ్రాఫర్లు కెమేరాలు క్లిక్‌మనిపించినప్పుడు శ్రీయ మాత్రం కంగారు పడ్డారట. కెమేరా కన్నుని తప్పించుకోవాలని ప్రయత్నించారట. ‘ఏమీ లేనప్పుడు అంత కంగారు ఎందుకు’ అన్నది కొందరి అభిప్రాయం. ‘ఏదో ఉంది’ కాబట్టే, శ్రీయ అలా తడబడ్డారని ప్రచారం మొదలుపెట్టారు.
క్రికెటర్‌తో ప్రేమలో పడిన మరో తార అని మాట్లాడుకుంటున్నారు. రెండ్రోజులుగా ఈ వార్త జోరుగా ప్రచారమవుతున్నా శ్రీయ నుంచి స్పందన లేదు. మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? గాసిప్‌కి స్పందించడం ఎందుకు? అని శ్రీయ ఊరుకున్నారనుకోవాలా? ఎవరి ఊహలు వారికే!