
సాక్షి, హైదరాబాద్: మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘గాయత్రి’.. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విష్ణు ట్విట్టర్లో షేర్ చేశాడు. గర్భవతిగా కనిపిస్తున్న శ్రియకు విష్ణు జడ వేస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్లో 'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత చాలెజింగ్ రోల్ ఇదేనని, తన కెరీర్‌లో బెస్ట్ సాంగ్ కూడా ఇదేనని.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విష్ణు కామెంట్ చేశారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. . తమన్ సంగీతం అందించాడు.
One of the most challenging roles I played so far. And one of my career best song in #Gayatri. Hope you all like the my first look from #Gayatri pic.twitter.com/ChyPhA4uhG
— Vishnu Manchu (@iVishnuManchu) 1 January 2018
Comments
Please login to add a commentAdd a comment