
సెప్టెంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1.
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు శ్రీయ (నటి), అంజలి (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవికి సంబంధించినది కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పుట్టిన తేదీ 11లో రెండు ఒకట్లు ఉండటం వల్ల ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది.
అయితే సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్