మాస్‌ రత్నమాల | Special Birthday Treat From VS11 Team To Anjali | Sakshi
Sakshi News home page

మాస్‌ రత్నమాల

Jun 17 2023 4:34 AM | Updated on Jun 17 2023 4:34 AM

Special Birthday Treat From VS11 Team To Anjali - Sakshi

ఊర మాస్‌ రత్నమాలగా కనిపించనున్నారు అంజలి. శుక్రవారం (జూన్‌ 16) ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘వీఎస్‌ 11’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ఆమె చేస్తున్న రత్నమాల పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌.  విశ్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శ కత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రత్నమాలగా అంజలి కనిపించనున్నారు. ఆమె పాత్ర మాస్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. విశ్వక్‌ సేన్‌ తొలిసారి ఈ చిత్రంలో క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, కెమెరా: అనిత్‌ మధాది, సహనిర్మాతలు: వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్‌ ఇన్నమూరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement