మళ్లీ అవన్నీ చేస్తా! | i wiil doit again all this sriya | Sakshi
Sakshi News home page

మళ్లీ అవన్నీ చేస్తా!

Published Sun, Jan 10 2016 1:30 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

మళ్లీ అవన్నీ చేస్తా! - Sakshi

మళ్లీ అవన్నీ చేస్తా!

ఆ రోజులే వేరు... మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే... అని ఒక్కసారైనా అనుకోనివాళ్లు ఉండరు. ఈ మధ్య శ్రీయ కూడా అలానే అనుకున్నారు. కాలం వెనక్కి వెళితే తాను ఏమేం చేయాలనుకుంటున్నారో శ్రీయ చెబుతూ - ‘‘కాలేజీలో జాయినవుతా. బోల్డంత మందితో స్నేహం చేస్తా. కాలేజీ లైఫ్‌ని వీలున్నంతవరకూ ఎంజాయ్ చేస్తా. బాగా చదువుకుంటా. అలాగే, నేనెక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటా. అంటే... సినిమాల్లోకి రాకముందు నేను కొన్ని నృత్యప్రదర్శనలు ఇచ్చాను.

అక్కణ్ణుంచే నా సినిమా కెరీర్ మొదలైంది. అందుకని మళ్లీ స్టేజి మీద డ్యాన్స్ చేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు. మరి.. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్ చిల్డ్రన్ సహాయం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. పుస్తకాలు చదవాలనుకుంటున్నా. అలాగే, విదేశాల్లో నివసించాలని ఉంది. ఆ దేశాల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా చాలా చాలా అనుకుంటున్నా. అనుకున్నట్లు అన్నీ చేయగలిగితే బాగానే ఉంటుంది. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో?’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement