
జెనీలియా
కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment