Step by step
-
యూపీఐ రాంగ్ పేమెంట్.. ఇలా చేయండి కంప్లయింట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..యూపీఐ సమస్యల రకాలుఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.తప్పు లావాదేవీపై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. -
ఇన్‌స్టాలో డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవడానికి...
ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ నుంచి డిలీట్ చేసిన కంటెంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? ఇలాంటి వారికి సులువుగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి.. ► ఇన్‌స్టా ఓపెన్ చేసిన తరువాత ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి. ► టాప్రైట్లోని ‘మోర్ ఆప్షన్స్’ ట్యాప్ చేయాలి. ► యాక్టివిటీ కంట్రోల్స్–ట్యాప్ ► రీసెంట్ డిలీటెడ్–ట్యాప్ ► టాప్‌లోని టైప్ ఆఫ్ కంటెంట్ (రీస్టోర్–ప్రొఫైల్ పోస్ట్,రీల్స్, వీడియోస్, స్టోరీస్) సెలెక్ట్ చేసుకోవాలి ► రీస్టోర్ చేయాలనుకున్నదానిపై ట్యాప్ చేయాలి. ► టాప్ రైట్‌లోని మోర్ ఆప్షన్–ట్యాప్ ► రీస్టోర్ టు ప్రొఫైల్ లేదా రీస్టోర్ టు రీస్టోర్ కంటెంట్ ట్యాప్ చేయాలి. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..) -
బీసీ బిల్లు కోసం దశలవారీ ఉద్యమం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి బీసీ, కులసంఘాల విస్తృతస్థాయి సమావేశం డిమాండ్ ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద మహాభేరి హైదరాబాద్: బీసీ బిల్లు కోసం బీసీ, కుల సంఘాలు ఏకమయ్యాయి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, రాష్ట్రంలో బీసీ కులాల ఫెడరేషన్లకు నిధులు కేటాయించాలని, దశలవారీగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం ఇక్కడ జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ, కుల సంఘాలు పాల్గొన్నాయి. బీసీల్లోని కులానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని, ర్యాంకులతో నిమిత్తం లేకుండా బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, అత్యంత వెనుకబడిన, సంచారజాతులకు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగా బీసీలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా పార్లమెంట్లో బీసీ బిల్లు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత తదితర డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తె చ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, సీపీఐ నేత టి.వెంకట్రాములు, టీటీడీపీ నేత బుచ్చిలింగం, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గంగపుత్ర సంఘం నేత ఏఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం నేత గణేష్చారితోపాటు 70 కుల సంఘాలు, 30 బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డిమాండ ్ల సాధనకు ఈ నెల మూడోవారంలో ఇందిరాపార్కు వద్ద బీసీల మహాభేరి నిర్వహించాలని, వచ్చే నెలలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించాలని తీర్మానించారు. పోరాడే సమయం: కృష్ణయ్య బీసీలుగా వాటాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని ఆర్.కృష్ణయ్య అన్నారు. డిమాండ్ల సాధనకు దశలవారీగా ఉద్యమించాలని, అంతిమంగా రాష్ర్టబంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్లవారీగా కాకుండా 80 శాతం సబ్సిడీతో వ్యక్తిగత రుణాలివ్వాలని, బీసీలకు 500 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన కత్రినా
ఇప్పుడంటే కత్రినా కైఫ్ టాప్ హీరోయిన్. కానీ ఆమె కెరీర్ జీరో నుంచే మొదలైంది. ఎన్నో ఎదురుదెబ్బలు తిని... స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారామె. కత్రినా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు. ► కత్రినా అసలు పేరు ‘కత్రినా టర్కోట్’. కత్రినా తల్లి సుజానె ఇంటి పేరు టర్కోట్. మొదట్లో తన పేరుకి కొనసాగింపుగా తల్లి ఇంటి పేరుని పెట్టుకున్న కత్రినా ఆ తర్వాత తన తండ్రి మహమ్మద్ ఇంటి పేరు కైఫ్‌ని జోడించారు. అది కూడా ఇండియా వచ్చాకే అలా మార్చుకున్నారు. ‘కైఫ్’ పేరు ఇండియన్ పేరుకి దగ్గరగా ఉంది కాబట్టే తన పేరుని ఆ పేరుకి చేర్చారు. ► ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఓ అన్నయ్య, కత్రినాతో కలిపి మొత్తం ఎనిమిది మంది సంతానం. కత్రినా చిన్నప్పుడే వాళ్ల తల్లిదండ్రులు విడిపోయారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ తండ్రితో టచ్‌లో లేనని కత్రినా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ► హాంగ్‌కాంగ్‌లో పుట్టిన కత్రినా చైనా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోల్యాండ్, జపాన్, బెల్జియమ్.. ఇలా పలు దేశాలు తిరిగారు. ఆమె తల్లి సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా తల్లితో ఈ దేశాలన్నీ తిరిగిన కత్రినా ఫైనల్‌గా తన కుటుంబంతో లండన్‌లో సెటిలయ్యారు. ► లండన్‌లో మోడల్‌గా చేస్తున్నప్పుడు బాలీవుడ్ నిర్మాత కైజాద్ గుస్తాద్ ‘బూమ్’లో ఒక పాత్ర ఇచ్చారు. ఆ విధంగా ముంబయ్ వచ్చారు కత్రినా. ► ‘బూమ్’లో పెద్దగా పేరు రాకపోవడంతో కత్రినాకు వెంటనే అవకాశాలు రాలేదు. అప్పుడు కొన్ని నెలలు పాటు ముంబయ్‌లో తన పోర్ట్‌ఫోలియో పట్టుకుని ప్రతి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీకి తిరిగేవారు. అప్పుడు సొంత వాహనం కూడా ఉండేది కాదు. టాక్సీల్లోనే అన్ని ఆఫీసులకు వెళ్లేవారు. ► కథానాయిక కాకముందు పలు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు కత్రినా. ఆ ఫొటోలను పెద్ద పెద్ద బేనర్లుగా తయారు చేయించి, కొన్ని స్టూడియోల్లో బేనర్లు పెట్టేవారట. ఆ బేనర్స్‌లో కత్రినా తన ఫోన్ నంబర్ అచ్చు వేయించేవారట. ► తాను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముంబయ్‌లో ఉంటే కచ్చితంగా సిద్ధివినాయక టెంపుల్‌కి వెళతారు. అలాగే, ముంబయ్‌లోని మౌంట్ మేరీ చర్చ్‌ని సందర్శించడం కత్రినా అలవాటు. సినిమా విజయం సాధించాలని ప్రార్థనలు జరుపుతుంటారు. ► కత్రినాకు చీకటంటే చాలా భయం. అలాగే, పురుగులంటే అలర్జీ. ► బాలీవుడ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని అడిగితే, ‘అలీ అబ్బాస్ జాఫర్’ పేరు చెబుతారు కత్రినా. ఆమె కథానాయికగా నటించిన ‘మేరీ బ్రదర్ కీ దుల్హన్’ చిత్రానికి ఆయనే దర్శకుడు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైంది. ► చెప్పిన సమయానికి పదిహేను నిమిషాలు ముందే షూటింగ్ లొకేషన్లో ఉండటం కత్రినా అలవాటు. అందుకే, పంక్చువాల్టీకి కేరాఫ్ ఆడ్రస్ కత్రినా అని బాలీవుడ్లో అంటుంటారు.