కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్ గైడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మార్కెట్‌లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్ గైడ్ నెటింట తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్‌లో చాలా విపులంగా వివరించి ఉంది.
ఓ రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్ గైడ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.
While going for market for vegetables my wife shared with me this👇 stating that you can use this as a guide 🤔🤔😃 pic.twitter.com/aJv40GC6Vj
— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) September 13, 2024
(చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment