vegetabels
-
కూరగాయల షాపింగ్ గైడ్!
కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్ గైడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మార్కెట్లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్ గైడ్ నెటింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్లో చాలా విపులంగా వివరించి ఉంది. ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్ గైడ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.While going for market for vegetables my wife shared with me this👇 stating that you can use this as a guide 🤔🤔😃 pic.twitter.com/aJv40GC6Vj— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) September 13, 2024 (చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
కొండెక్కుతున్న ఉల్లి ధర..
-
Health: శాకాహారంతోనూ.. మంచి మజిల్స్!
మంచి శరీర సౌష్ఠవం కోరుతూ వ్యాయామాలు చేసేవారు తమ మజిల్స్ పెరగడానికి మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అయితే శాకాహారపుప్రోటీన్లు సైతం మంచి కండరాలను ఇస్తాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. బలమైన కండరానికి ప్రోటీన్ కావాలి తప్ప... అది మాంసం నుంచా లేక శాకాహారం నుంచా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు వారు. కొందరు ఎక్సర్సైజ్ ప్రియులను ఆరు గ్రూపులు గా విభజించి వారికి... కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు–వాటి ఉత్పాదనలు, చేపలు, వేటమాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠాణీల వంటి పప్పుధాన్యాలను అందించారు.దీనికి ముందూ... ఆ తర్వాత వారి మజిల్ మాస్, కండరాల సౌష్ఠవం వంటి వాటిని లెక్కించారు. ప్రోటీన్ ఏదైనప్పటికీ మజిల్‌మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించకపోగా.. శాకాహారప్రోటీన్ తీసుకున్న వారిలో ప్రోస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనర్థాల ఆనవాళ్లు లేవని తేలింది!ఇవి చదవండి: అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో -
భర్తకు కూరగాయల ఎంపిక పరీక్ష.. పాసవుతాడా?
ప్రతీ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలనేవి సాధారణంగా వస్తూనే ఉంటాయి. దంపతుల మధ్య గొడవలనేవి లేకపోతే మాధుర్యమే ఉండదని అనేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య ఇంటిలోని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో గొడవలు వస్తుంటాయి. భార్యాభర్తలు మార్కెట్‌కు వెళ్లి, వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు వారి మధ్య వాదనలు చోటుచేసుకుంటాయి. అలాగే భార్య.. భర్తకు లిస్టు ఇచ్చి, ఏమైనా సరుకులు తీసుకురమ్మని చెప్పినప్పుడు, భర్త ఏదైనా మరచిపోతే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. తాజాగా ఇలాంటి ఒక ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భార్య.. మార్కెట్‌కు వెళ్లి, తీసుకురావాల్సిన కూరగాయల లిస్టును భర్తకు ఇచ్చింది. దానిలో తీసుకురావాల్సిన కూరగాయల గురించి రాసింది. అవి ఏ రీతిలో ఉండాలో క్షుణ్ణంగా రాసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టును చూసినవారికి తల తిరిగిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కూరగాయల లిస్టులో ముందుగా టమాటాలు ఎలా ఉండాలో తెలిపింది. టొమాటాలు పసుపు, ఎరుపు రంగులోనే ఉండాలని, వాటికి పగుళ్లు ఉండకూడదని రాసింది. తరువాత ఉల్లిపాయల విషయానికొస్తే.. ఈ జాబితాను రూపొందించిన భార్య ఉల్లిపాయ బొమ్మ గీసి, ఎలాంటి ఉల్లిపాయలను ఎంచి తీసుకురావాలో వివరించింది. అదేవిధంగా బంగాళాదుంపల ఎంపిక వివరాలు కూడా ఉన్నాయి. అలాగే మిరపకాయలు, పాలకూర, లేడీ ఫింగర్.. ఇలా వీటి కొనుగోలుకు సంబంధించిన వివరణాత్మక సమాచారం ఆ చీటీలో ఉంది. జాబితా చివరలో ఇవి కూరగాయల వ్యాపారి దగ్గరి నుంచి తీసుకురావాలని ఆ భార్య గుర్తుచేసింది. ఈ పోస్ట్ @trolls_official అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ జాబితాను చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘ఆ మహిళకు అవార్డు ఇవ్వాల్సిందే’ అనగా, మరో యూజర్ ఈ మహిళ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో మంచి ఎక్స్‌ప్లైనర్ అయివుంటుందని రాశారు. ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది? -
వింత ఫోబియా: కూరగాయలు, ఆహారం చూస్తే చాలు వణికిపోతుంది
లండన్: మనం ఇంత కష్టపడి సంపాదించేంది ఎందుకు జానెడు పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే. కుబేరుడైనా సరే ఆకలేస్తే తినేది అన్నమే. మనిషి బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో ఆహారం ప్రముఖ పాత్రం పోషిస్తుంది. అలాంటిది ఆహారాన్ని చూస్తేనే భయంతో చెమట పడితే. తిండి చూస్తే.. చెమట పట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇది వాస్తవం. ఓ మహిళ ఇలాంటి వింత ఫోబియాతోనే బాధపడుతుంది. సాస్ వేసి ఉన్న ఆహారాన్ని చూసిన.. వేర్వేరు పదార్థాలను కలిపి వండినా, వడ్డించినా.. తప్పుడు పద్దతిలో వడ్డించినా, కూరగాయాలు చూసినా ఆమెకు చెమటలు పడతాయట. ప్రస్తుతం ఆమె కేవలం టమాటా సూప్ తాగుతూ బతికేస్తుంది. ఆ వివరాలు.. ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్(34) తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదట. గత కొన్నేళ్లుగా ఆమె రైస్ కేక్, టమాట సూప్ తాగుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. బాల్యం నుంచి కూడా షార్లెట్ సరిగా తినేది కాదట. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని భావించేవారు మొదట్లో. బలవంతంగా ఏదైనా తిందామని ప్రయత్నిస్తే.. వాంతికి అయ్యేదట. (చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!) రాను రాను ఈ పరిస్థితి మరింత తీవ్ర కాసాగింది. సాస్ వేసిన ఆహారం చూసినా.. మిల్క్ షేక్‌లు, వేర్వేరు ఫుడ్ ఐటమ్స్‌ని కలిపి వడ్డించినా షార్లెట్‌కి నచ్చేది కాదు. ఇలాంటి ఆహారాన్ని చూస్తే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేవి. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరుగుతుంది.. తప్ప దాని మీద ఇష్టం కలగడం లేదు. ఈ క్రమంలో షార్లెట్ తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్ స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తినేది కాదు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల వద్దే ఉండేది కాబట్టి.. ఈ ఫోబియా వల్ల షార్లెట్ పెద్దగా ఇబ్బంది పడలేదు. (చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..) చదువు పూర్తయిన తర్వాత షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి వంట చేసి పెడతారు. మొదట ఆ భోజనం చూసి షార్లెట్ చాలా భయపడేది. తర్వాత ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తానే వండుకోసాగింది. ఈ సందర్భంగా షార్లెట్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి కూరగాయలు చూస్తే నాకు భయం వేసేది. ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తే వాంతికి వచ్చేది. పెరుగుతున్న కొద్ది భయం కూడా పెరగసాగింది. ఇప్పుడు ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా నాకు కడుపులో దేవేస్తుంది. ప్రస్తుతం నేను రైస్ కేక్, టమాటా సూప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫోబియా నా సోషల్ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతున్నాను. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బలంగా కోరుకుంటున్నాను.. ప్రయత్న ప్రారంభించాను.. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తాను’’ అని తెలిపింది. చదవండి: సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో.. -
ఇదో హైటెక్ రైతు కథ.. పట్నం మధ్యలో ప్రకృతి వ్యవసాయం
ఒకప్పుడు నగర శివారుల్లో పంట, పొలాలు కనిపించేవి. రైతులు సాగు చేస్తూ కనిపించే వారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. రానురాను శివారు ప్రాంతాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతూ ఉండటంతో అటు రైతులు.. ఇటు పొలాలు కనుమరుగవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో... భూమి ధర తెలిసిన వాడు అమ్ముకుంటుంటే.. భూమి విలువ తెలిసిన వాడు సేద్యాన్ని నమ్ముకుంటున్నాడు. భూమి ధర మంచిగొస్తుంటే సేద్యం ఎవరు చేస్తారులే? అనే ప్రశ్న మనలో తలెత్తడం సర్వసాధారణం. కానీ ఓ రైతు సేద్యాన్నే నమ్ముకుని ఔరా అనిపిస్తున్నాడు. మరి కాలనీల మధ్యలో వ్యవసాయం చేస్తున్న ఆ రైతు ఎవరో తెలుసుకుందామా? సాక్షి, మీర్‌పేట(హైదరాబాద్): గ్రామపంచాయితీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినా.. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై ఉన్న మక్కువతో కాంక్రీట్ జంగిల్ మధ్య వ్యవసాయం చేస్తున్నాడో రైతు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడకు చెందిన సిద్దాల కొమురయ్య దాదాపు 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతం నగరానికి ఆనుకుని ఉండటం.. చుట్టూ కాలనీలు వెలిసినప్పటికీ వ్యవసాయాన్ని వదలకుండా తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో నేటికీ సేద్యం చేస్తుండడం విశేషం. వరితో పాటు పాలకుర, తోటకూర, వంకాయలు పండిస్తుంటాడు. ప్రస్తుతం ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో చామగడ్డ పంటను పండిస్తున్నాడు. సేద్యం, అమ్మకం ఒకేచోట.. ► సిద్దాల కొమురయ్య తాను పండించిన కూరగాయలు, ఆకు కూరలను పండించిన చోటే భార్య అంజమ్మతో కలిసి విక్రయిస్తుంటాడు. ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులతో కూరగాయలు, ఆకు కూరలను సాగు చేస్తుండటంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. స్థానికులకు విక్రయించగా మిగిలిన వాటిని మాదన్నపేట మార్కెట్‌కు సరఫరా చేస్తామని కొమురయ్య తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో అర ఎకరం స్థలం ఉంటే ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో నగరానికి ఆనుకుని ఉన్న జిల్లెలగూడ ప్రాంతంలో విలువైన భూమి ఉన్నప్పటికీ కొమురయ్య ఇంకా వ్యవసాయం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నగర పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ చిట్టి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి సేద్యాన్ని పరిచయం చేయొచ్చని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయంపై మక్కువతోనే.. తెలివి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. చుట్టూ కాలనీలు వెలిసినా సేద్యంపై మక్కువతో నాకున్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేస్తు న్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం ఒక ఎకరంలో వరిపంట, మరో ఎకరాలో చామగడ్డ, వంకాయ పంటలను సాగు చేస్తున్నాను. నాలుగు నెలల నుంచి సాగు చేస్తున్న చామగడ్డ పంట చేతికి వచ్చింది. నాలుగైదు రోజుల్లో కోతకోసి విక్రయిస్తాం. – సిద్దాల కొమురయ్య, రైతు, జిల్లెలగూడ -
బతుకు పూలబాటకాదు
గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు. సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది. ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది. కరోనా దెబ్బతో విలవిల రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు. కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు రెండున్నర ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్ 23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా -
కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!
-
మార్కెట్ యార్డుల్లోనూ రైతు బజార్లు
-
విశాఖలో ఇళ్ల వద్దకే కూరగాయల పంపిణీ
-
ప్రజల కోసం రంగంలోకి..
-
కడుపులోకి ‘కల్తీ’ కూట విషం..
సాక్షి, హైదరాబాద్: పండ్లు.. కూరగాయలు.. ఆకు కూరలు.. పప్పులు.. బియ్యం.. సుగంధ ద్రవ్యాలు.. గోధుమలు కాదేదీ పెస్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు) ఆనవాళ్లకు అనర్హం అన్నట్లుగా మారింది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ వాసులు రోజువారీగా విని యోగిస్తున్న నిత్యావసరాలు, పలు రకాల ఆహార పదార్థాల నమూనాల్లోనూ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ పరిధిలో బహిరంగ మార్కెట్ల, లో విక్రయిస్తున్న ఆహార పదార్థాల్లో మొత్తం గా సుమారు 30% మేర పెస్టిసైడ్స్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఎరువులు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా మంటూ ప్రచారం చేసుకుంటున్న పలు సంస్థలు తమ ఆర్గానిక్ స్టోర్లలో విక్రయిస్తున్న నమూనాల్లోనూ ఈ ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయా స్టోర్లలో సేకరించిన పలు రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయల్లోనూ విష రసాయనాల ఆనవాళ్లు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా వీటి ఆనవాళ్లు బయటపడ్డాయి. కూరల్లో వాడే కరివేపాకులోనూ వీటి ఆన వాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నమూనాలను నగరంలోని పలు బహిరంగ మార్కెట్లలో సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మో క్రిమి సంహారకాలు.. క్రిమి సంహారకాల్లో ప్రధానంగా ఆర్గానో క్లోరిన్, ఎసిఫేట్, ఎసిటామిప్రిడ్, అజోక్సీ స్టార్బిన్, కార్బన్డిజం, ఇమిడాక్లోప్రిడ్, టిబ్యుకొనజోల్ తదితర క్రిమిసంహారక ఆన వాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించి న పరిమితులకు మించి ఉంటున్నాయి. ఎసిఫేట్, లిండేన్ వంటి క్రిమి సంహారకాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వాటి ఆనవాళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సుగంధ ద్రవ్యమైన యాలకులలోనూ క్వినై ఫోస్, అజోక్సీస్టార్బిన్, థయామె టోక్సా మ్ వంటి క్రిమి సంహారకాలు ఉంటున్నాయి. పెస్టిసైడ్స్ ఆనవాళ్లతో అనర్థాలివే.. దేశంలో సరాసరిన 10% మధుమేహ బాధి తులుండగా.. హైదరాబాద్‌లో సుమారు 16–20% మంది ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దేశంలో గ్రేటర్ సిటీ డయాబెటిక్ క్యాపిటల్‌గా మారుతుండటం ఆందోళన కలి గిస్తోంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే క్రిమిసంహారకాలు ఆహారపదార్థాల ద్వారా మానవశరీరంలోకి ప్రవేశిస్తే సుమారు 20 ఏళ్ల పాటు అలాగే తిష్టవేసే ప్రమాదం ఉంద ని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్రిమిసంహారకాల అవశేషాలు దేహం లోని కొవ్వు కణాల్లో నిల్వ ఉంటాయని.. పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణ మవుతాయంటున్నారు. కూరగాయలను ఉప్పు నీళ్లతో కడిగిన తరవాత.. బాగా ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహానికి కారకాలు.. తెలుగు రాష్ట్రాల్లో శరీర బరువు తక్కువగా ఉన్న వారు.. రక్తంలో కొవ్వు మోతాదు తక్కువ ఉన్న వారు సైతం మధు మేహ వ్యాధి బారిన పడేందుకు ఆర్గానో క్లోరిన్ తదితర క్రిమి సంహారక ఆనవాళ్లు ఆహార పదార్థాల్లో చేర డమే ప్రధాన కారణ మని ఈ నివేదిక హెచ్చరిం చింది. మరోవైపు ఆర్గానో క్లోరిన్ క్రిమిసం హారకాల తయారీ దేశంలో అధి కంగా జరుగుతోందని.. ఇక లిండేన్ వంటి నిషే ధిత క్రిమిసంహారకాన్ని సైతం దేశంలో పలు ప్రాం తాల్లో విరివిగా విని యోగిస్తుండటంతో పలు అనర్థాలు తలెత్తు తున్నా యని ఈ నివేదిక స్పష్టం చేసింది. తలసరి క్రిమిసం హారకాల వినియోగం లోనూ రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండటం గమనార్హం. తల్లిపాలలోనూ క్రిమి సంహారకాల ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. -
సాగు చేసే రైతులకు మార్కెట్ ఫీజ్ రద్దు
-
నేటి నుంచి పండ్లు, కూరగాయల రైతులకు ఫీజులు రద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: పండ్లు, కూరగాయలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో ఫీజును రద్దు చేసింది. ఈనెల 2వ తేదీన ప్రభుత్వం జీవో నం.58 విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 22 మార్కెట్లలో బుధవారం నుంచి అధికారికంగా ఫీజు రద్దు అమలు చేయనున్నారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయల ఉత్పత్తులకు ఎటువంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుల్లో ఉన్న కమీషన్ ఏజెంట్ల వ్యవస్థకు మంగళం పలికారు. ఇప్పటి వరకూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డుల్లో 4 నుంచి 10 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రద్దుతో రైతులకు ఊరట లభించనుంది. కమీషన్ ఏజెంట్లు వ్యాపారం చేయాలంటే ట్రేడర్స్‌గా మారాల్సి ఉంటుంది. వీరు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీంతో ఔత్సాహికులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. ప్రధానంగా మదనపల్లి, ఏలూరు, తెనాలి, బంగారుపాలెం, పుంగనూరు, రావులపాలెం వంటి మార్కెట్లలో అమలు కానుంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా.. రైతులు, వినియోగదారులకు మేలు కలుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఏం కొనేటట్లు లేదు...ఏం తినేటట్లు లేదు
సాక్షి, ఆమదాలవలస రూరల్ : కొన్ని రోజులుగా ఎండలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇదివరకు కొద్దిపాటి సొమ్ముతో మార్కెట్‌కు వెళ్తే వారం రోజులకు సరిపడా సరుకులు వచ్చేవని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని వాపోతున్నారు. ఇలాగే ధరలు కొనసాగితే పూట గడవడం కూడా కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ధరలు బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్ దుకాణాల్లో కూడా అధిక ధరలే ఉన్నాయి. దీంతో అరకొరగా కూరగాయలు కొనుగోలు చేసి పొదుపుగా వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు వ్యవరిస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాంసం ప్రియులకు చేదు వార్త కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కూడా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చికెన్ తినే పరిస్థితి లేదు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గుతుండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కిలో చికెన్ ధర రిటైల్ మార్కెట్లో రూ.160లుగా ఉంది. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ధరలు మరో రూ.20 నుంచి రూ.50 పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ధరలు అదుపు చేయాలి ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు మూడుపూటలా తినే పరిస్థితి లేదు. ధరల దెబ్బతో ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -కూన రామకృష్ణ, కృష్ణాపురం ఏమీ కొనే పరిస్థితి లేదు గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో కూరగాయల ధరలు ఆమాంత పెరిగిపోయాయి. దీనివలన ఏమీ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. -బొడ్డేపల్లి రవికుమార్, తిమ్మాపురం -
ఇంటికి ఆకుపచ్చ పందిరి
సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు కావాలనుకుంటున్నారా? పుచ్చులులేని, పురుగుమందులు వాడని పండ్లు ఉంటే బావుంటుందని భావిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే వీటిని పండిం చుకోవచ్చు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో కేవలం 200 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు సొంతంగా సాగు చేసుకోవచ్చు. కనీసం 100 చదరపు అడగులున్నా సరే ఇంటిల్లిపాదికీ ఏడాదిపాటు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, రెండు మూడు రకాల పండ్లు పండించుకోవచ్చు. ప్రస్తుతం నగరవాసులు తాజా కూరగాయలు, ఆకుకూరల కోసం సొంత సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 వేల ఇళ్లలో అర్బన్ ఫార్మింగ్ జరుగుతోంది. వాస్తవానికి నగరంలో దాదాపు 22 లక్షల ఇళ్లలో ఇంటిపంటకు అవకాశం ఉండగా, కేవలం 40వేల ఇళ్లలో మాత్రమే రూఫ్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ జరుగుతోంది. అయితే, దేశంలో ఇంటిపంటల నిర్వహణలో కేరళ, కర్ణాటక తర్వాత మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉండటం విశేషం. కొచ్చిన్, త్రివేండ్రమ్ వంటి నగరాల్లో ఇంటిపంటలను తప్పనిసరి అవసరంగా చాలామంది గుర్తించి ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా సొంత సాగు దిశగా పయనిస్తోంది. హైదరాబాద్ ఎంతో అనుకూలం... ఇంటిపంటలకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైన నగరం. సగటున 40 డిగ్రీల గరిష్ట, 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన నగర వాతావరణంలో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగుచేసుకోవచ్చు. నగరంలో ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 3వేల టన్నుల ఆకుకూరలు, కూరగాయలతోపాటు 100 టన్నుల పండ్లు వినియోగమవుతున్నాయి. పోషకాహార నిపుణుల అంచనా ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు అవసరం. దాదాపు 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న గ్రేటర్ భూభాగంలో నగర అవసరానికి సరిపడా ఇంటి పంటలు పండించుకోవడం ఏమాత్రం కష్టం కాదు. నగరంలో సుమారు 22 లక్షల ఇళ్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. వీటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో సుమారు 14,824 ఎకరాల సాగు స్థలాలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం సగం స్థలంలో ఇంటిపంట సాగుచేసినా నగర ప్రజల కూరగాయల అవసరాలు తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం 40వేల ఇళ్లలో సాగుతున్న రూఫ్ గార్డెనింగ్ స్థలాన్ని లెక్కిస్తే అది కనీసం వంద ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంటిపంటల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారిని సొంత సాగు దిశగా ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఇంటిపంట కిట్లను రాయితీపై అందజేస్తున్న ఉద్యానశాఖ.. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతోంది. మరోవైపు సహజ ఆహారం వంటి స్వచ్చంద సంస్థలు, పలువురు ఆర్గానిక్ ఆహార ప్రియులు సైతం ఇంటిపంటను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాయితీ పై అర్బన్ ఫార్మింగ్... ఇంటిపంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవనశాఖ గత ఐదేళ్లుగా అర్బన్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రూఫ్ గార్డెన్, కిచెన్ గార్డెన్ సామగ్రిని రాయితీపై అందజేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 500 మందికి వీటిని అందజేసినట్లు ఉద్యానవనశాఖ అధికారి మధుసూధన్ ‘సాక్షి’తో చెప్పారు. 50 చదరపు అడుగుల నుంచి 200 చదరపు అడుగుల గరిష్ట స్థలం అందుబాటులో ఉన్న నగరవాసులు అర్బన్ ఫార్మింగ్ పథకానికి అర్హులు. ఈ పథకంలో కూరగాయలు పెంచేందుకు అవసరమైన సిల్ఫాలిన్ కవర్లు (మొక్కలు నాటేందుకు కావాల్సినవి), మట్టి మిశ్రమం, విత్తన సంచి, వేపపిండి, వేపనూనె, పనిముట్లు అందజేస్తారు. సాధారణంగా ఈ కిట్ ధర రూ.6వేలు కాగా, ఉద్యానవనశాఖ 50 శాతం రాయితీతో రూ.3వేలకే అందజేస్తోంది. ఇంటిపంట పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఉద్యానవనశాఖ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్‌కార్డు, పాస్ఫోర్ట్సైజ్ ఫొటోతోపాటు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి కిట్ పొందవచ్చు. అందులో 40 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల లోతు ఉన్న 4 సిల్ఫాలిన్ కవర్లు, 52 ఘనపు అడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువుతో కూడిన 20 పాలీ బ్యాగులు, 12 రకాల ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు, 25 కిలోల వేపపిండి, 500 మిల్లీలీటర్ల వేపనూనె ఉంటుంది. సాగు ఉపకరణాలతోపాటు షవర్, చేతి సంచి కూడా లభిస్తాయి. -
కూరగాయలు తగ్గిపోతాయ్!
మన వంటిళ్ళల్లో కాయగూరలూ, ఆకుకూరలు మాయమయ్యేరోజులు అతి త్వరలోనే రాబోతున్నాయా? సరైన పరిష్కారం ఆలోచించకపోతే ఇకపై మన భోజనంలో కూరగాయలు తరిగిపోవడం ఖాయమట. నలభై సంవత్సరాల పరిశోధన(1975–2016) అనంతరం అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తేల్చి చెప్పింది. గత నలభై యేళ్ళలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కాయగూరలూ, ఆకు కూరల దిగుబడి విపరీతంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు నేషనల్ అకాడమీ స్పష్టం చేసింది. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో కాయగూరల పంటలు 35 శాతానికీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడి 9 శాతానికి పడిపోయే ప్రమాదముందని తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు కూరగాయల దిగుబడిని 35 శాతానికి తగ్గించేస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ పరిశోధన నొక్కి చెబుతోంది. వాతావరణ కాలుష్యం, అధిక వేడిమి, గ్రీన్ గ్యాసెస్, నీటిలో ఉప్పు శాతం పెరగడం, అలాగే నీటి కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆకుకూరలు, కూరగాయల దిగుబడీ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల దిగుబడీ అనూహ్యంగా తగ్గిపోనున్నట్టు అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారిక జర్నల్ ప్రచురించింది. గత నాలుగు దశాబ్దాలుగా (1975–2016)వెలువడిన పలు పరిశోధనలను శాస్త్రీయంగా పరిశీలించిన మీదట అమెరికాలోని నేషనల్ అకాడమీ ఈ నిర్ధారణకు వచ్చింది. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ పెరగటం వల్ల పంట దిగుబడి కొంత మేరకు పెరగవచ్చునని గతంలో జరిగిన పరిశోధనలు సూచించాయి. అయితే ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి పెరిగే శాతం కంటే తగ్గే శాతమే ఎక్కువని ఈ అకాడమీ తేల్చి చెప్పింది. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో 174 పరిశోధన లు, 1,540 ప్రయోగాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చినట్టు పరిశోధకులు వివరించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చి చెప్పినప్పటికీ, కాయగూరలూ, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్రప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. గత నాలుగు దశాబ్దాలుగా వెలువడిన పరిశోధనలను పునఃసమీక్షించిన అనంతరం లండన్ యూనివర్సిటీలో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న అలన్ డాన్‌గౌర్ ఈ విషయాలను వెల్లడించారు. పర్యావరణ మార్పులను తట్టుకోలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి పరుచుకోవల్సిన తక్షణావశ్యకతను ప్రొఫెసర్ నొక్కి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారంలో ప్రధాన పాత్ర పోషించే ఆకుకూరలూ, కూరగాయలూ, చిక్కుడుజాతి గింజల కొరతతో మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లడమే కాకుండా ఆహారభద్రతకు సైతం పెనుముప్పు పొంచి వున్నట్టే. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యోగి భయంతో వెజ్ తిన్న ఐఎఎస్‌లు
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే ఐఏఎస్‌లకు కూడా భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకొని మెసులుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఏడాది ఇండియన్ అడ్మిన్ స్టేటివ్ సర్వీస్ అధికారుల వారాంతపు కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రతి ఏడాది చేపలు, మటన్, కోడిమాంసంతోపాటు ఇతర నాన్‌వెజ్ ఐటెమ్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే, ఆదిత్యనాథ్ ఈసారి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారి మెనూలో అసలు నాన్ వెజ్ లేకుండా చేశారు. ఎప్పటి మాదిరిగా కాకుండా పూర్తి శాఖాహార వంటకాలు సిద్ధం చేసుకున్నారు. గురువారం ఈ సమావేశాలు ప్రారంభం కాగా పన్నీర్ టిక్కా, ప్రైడ్ రైస్, హాండీ పన్నీర్, గులాబ్ జామున్, గజర్‌కా హల్వా వంటకాలతో సరిపెట్టుకుంటున్నారు. తొలి రోజు మేం శాఖాహారంతోనే ముగించేశాం అంటూ వారు కొంతమంది మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఇక గతంలో ముఖ్యమంత్రిగా అఖిలేశ్ యాదవ్ పనిచేసినప్పుడు జరిగిన సమావేశాల్లో ఫుల్‌గా నాన్ వెజ్ ఉండటమే కాకుండా ఆటలు పాటలు జరిగాయి. క్రికెట్ మ్యాచ్ కూడా జరగ్గా దాన్ని జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఇక మాయావతి సమయంలో అలాంటి కార్యక్రమాలు పూర్తిగా బంద్ పెట్టారు. -
ధరాఘాతం
పెరిగిన కూరగాయల ధరలు విలవిలలాడుతున్న సామాన్యులు చెన్నూర్ : కూరగాయల ధరలపై శ్రావణ మాసం ఎఫెక్ట్ పడింది. శ్రావణ మాసంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంతా మాంసాన్ని ముట్టుకోరు. నెలరోజుల పాటు శాకాహారాన్నే తీసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. గత వేసవి కాలంలో కూరగాయల సాగు తక్కువగా ఉండడంతో కూరగాయల ధరలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. చిరుధాన్యాల ధరలు కూడా అధికంగా పెరిగాయి. ప్రస్తుతం వర్షాకాలంలో కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. తగ్గిన సాగు విస్తీర్ణం చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, జైపూర్ మండలాల్లో మొత్తం కలిపి దాదాపు కేవలం వేయి హెక్టార్లలోపు మాత్రమే కూరగాయల సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గతంలో ఈ విస్తీర్ణం దాదాపు మూడు వేల హెక్టార్లుగా ఉండేదని వారు వివరిస్తున్నారు. గతంతో పోలీస్తే సాగు విస్తీర్ణం తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమనే చెప్పవచ్చు. దీంతో కూరగాయలను పక్కనున్న వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పెరిగిన ధరలు... నిన్న మొన్నటి వరకు కిలో రూ. 60 ఉన్న మిర్చి ధర ప్రస్తుతం కిలో రూ ధర 80 చేరుకుంది. ఇలా అన్ని కూరగాయాల ధరలు పెరిగాయి. దీంతో నిరుపేద వర్గాల ప్రజలు అందోళన చెందుతున్నాయి. ఇదే విధంగా కూరగాయాల ధరలు పెరుగుకుంటూ పోతే నిరుపేదలకు కూరగాయల భోజనం కరువయ్యే పరిస్థితులు వస్తాయని పలువురు మహిళలు తెలుపుతున్నారు.