
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే ఐఏఎస్‌లకు కూడా భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకొని మెసులుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఏడాది ఇండియన్ అడ్మిన్ స్టేటివ్ సర్వీస్ అధికారుల వారాంతపు కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రతి ఏడాది చేపలు, మటన్, కోడిమాంసంతోపాటు ఇతర నాన్‌వెజ్ ఐటెమ్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే, ఆదిత్యనాథ్ ఈసారి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారి మెనూలో అసలు నాన్ వెజ్ లేకుండా చేశారు.
ఎప్పటి మాదిరిగా కాకుండా పూర్తి శాఖాహార వంటకాలు సిద్ధం చేసుకున్నారు. గురువారం ఈ సమావేశాలు ప్రారంభం కాగా పన్నీర్ టిక్కా, ప్రైడ్ రైస్, హాండీ పన్నీర్, గులాబ్ జామున్, గజర్‌కా హల్వా వంటకాలతో సరిపెట్టుకుంటున్నారు. తొలి రోజు మేం శాఖాహారంతోనే ముగించేశాం అంటూ వారు కొంతమంది మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఇక గతంలో ముఖ్యమంత్రిగా అఖిలేశ్ యాదవ్ పనిచేసినప్పుడు జరిగిన సమావేశాల్లో ఫుల్‌గా నాన్ వెజ్ ఉండటమే కాకుండా ఆటలు పాటలు జరిగాయి. క్రికెట్ మ్యాచ్ కూడా జరగ్గా దాన్ని జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఇక మాయావతి సమయంలో అలాంటి కార్యక్రమాలు పూర్తిగా బంద్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment