మంచి శరీర సౌష్ఠవం కోరుతూ వ్యాయామాలు చేసేవారు తమ మజిల్స్ పెరగడానికి మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అయితే శాకాహారపుప్రోటీన్లు సైతం మంచి కండరాలను ఇస్తాయంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు.
బలమైన కండరానికి ప్రోటీన్ కావాలి తప్ప... అది మాంసం నుంచా లేక శాకాహారం నుంచా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు వారు. కొందరు ఎక్సర్‌సైజ్ ప్రియులను ఆరు గ్రూపులు గా విభజించి వారికి... కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు–వాటి ఉత్పాదనలు, చేపలు, వేటమాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠాణీల వంటి పప్పుధాన్యాలను అందించారు.
దీనికి ముందూ... ఆ తర్వాత వారి మజిల్ మాస్, కండరాల సౌష్ఠవం వంటి వాటిని లెక్కించారు. ప్రోటీన్ ఏదైనప్పటికీ మజిల్‌మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించకపోగా.. శాకాహారప్రోటీన్ తీసుకున్న వారిలో ప్రోస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనర్థాల ఆనవాళ్లు లేవని తేలింది!
ఇవి చదవండి: అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్: భావోద్వేగ క్షణాలు, వైరల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment