రోటీన్‌కు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని మీరు తహతహలాడుతారా?
బహదూర్‌పురా: రోటీన్‌కు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని మీరు తహతహలాడుతారా? ఎదుటివారికి చక్కగా వివరించే చెప్పే నైపుణ్యం, పర్యాటకులను ఆకట్టుకునే వాక్చాతుర్యం మీ సొంతమా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. నెహ్రూ జూవాలాజికల్ పార్కులో 'గైడ్' పోస్టులు మీకోసం ఎదురుచూస్తున్నాయి.
పార్కులో స్వచ్ఛందంగా గైడ్‌లుగా, వాలంటరీలుగా పనిచేసేందుకు ఆసక్తి గల యువత ముందుకు రావాలని జూపార్కు క్యూరేటర్ గోపిరవి అన్నారు. అన్ని విభాగాల్లో అభివద్ధి చెందిన జూపార్కును గైడ్‌లను, వాలంటరీలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వచ్ఛందంగా వాలంటరీలుగా, జూ గైడ్‌లుగా పనిచేసేందుకు ఆసక్తి గల వారు జూ ప్రధాన కార్యాలయంలో గానీ క్యూరేటర్ 9440810162 నంబర్‌లో సంప్రదించాలన్నారు.