ఆభరణం చాలా రోజులు బీరువాలో ఉంచితే కొద్దిగా మసకబారినట్లు అనిపిస్తుంది. ఆభరణం ధగధగలాడాలంటే ధరించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ధరించిన తర్వాత తిరిగి భద్రపరిచేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
👉ఆభరణాన్ని (బంగారు ఆభరణం, వజ్రాల ఆభరణం ఏదైనా) ధరించే ముందు వెల్వెట్ క్లాత్ లేదా మెత్తని నూలు వస్త్రంతో సున్నితంగా తుడవాలి.
👉దుమ్ము పట్టేసినట్లనిపిస్తే వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇది చాలా అరుదుగా మాత్రమే చేయాలి. ఓపెన్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని వేడి నీటిలో ఒకసారి ముంచి తీసి వెంటనే టిష్యూ పేపర్‌తో తేమ వదిలే వరకు సున్నితంగా తుడవాలి. ఇది ఇతర రంగు రాళ్లేవే లేకుండా అన్నీ వజ్రాలే ఉన్న ఆభరణానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలను వేడి నీటిలో ముంచరాదు.
👉క్లోజ్‌డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని నీటిలో ముంచకూడదు. నీటిలో ముంచినట్లయితే కొంతనీరు వజ్రానికి బంగారానికి మధ్యలో చేరుతుంది. ఆ నీటిని తొలగించడం కష్టం. మరీ ఎక్కువగా నీరు పట్టినప్పుడు వజ్రాన్ని తీసి మళ్లీ చేయించుకోవడమే మార్గం. కాబట్టి క్లోజ్‌డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణం మీద పట్టిన దుమ్మును వదిలించాలంటే టిష్యూ పేపర్ లేదా వెల్వెట్ క్లాత్‌తో తుడవాలి. అంతేకాదు, ఆభరణాలను తరచూ నీటితో శుభ్రం చేస్తుంటే బంగారం కరిగిపోతుంది.
👉ఏ ఆభరణాన్నయినా (పూర్తి బంగారు ఆభరణాలు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు) తెల్లటి ప్లాస్టిక్ బాక్సుల్లోనే పెట్టాలి.
👉 వెల్వెట్ క్లాత్‌కి రంగును వదిలే స్వభావం ఉంటుంది. దీర్ఘకాలం వెల్వెట్ క్లాత్ మధ్య ఉంచితే వెల్వెట్ క్లాత్ రంగు ప్రభావం ఆభరణం మీద పడుతుంది.
👉వజ్రాల ఆభరణాలు ఒక బాక్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. వజ్రం గట్టిగా ఉంటుంది. కోసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్ కారణంగా మరొక స్టోన్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment