సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్‌వైపే చూస్తోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులను గోల్స్ వర్షంలో తడిపేస్తున్నాయి. రోజుకో రసవత్తర పోరుతో ప్రేక్షకులు ఆనందలోకాల్లో విహరిస్తున్నారు. ఫుట్‌బాల్ వీరాభిమానుల్లో కొందరికి ఆట ఆడడం అంటే ఇష్టమైతే మరికొందరికి ఆ ఆటలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రతోపాటు ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మాత్రం ‘ది ఫుట్‌బాల్ ఫెంటాస్టిక్ ఎసెన్షియల్ గైడ్’ పుస్తకం చదవాల్సిందే.
‘కిక్-ఆఫ్’ పేరిట ప్రముఖ ఫుట్‌బాల్ నిఫుణుడు, ప్రముఖ వ్యాఖ్యాత నవీ కపాడియా ఈ పుస్తకాన్ని రచించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా తన పుస్తకానికి సంబంధించి రచయిత కపాడియా ‘సాక్షి’తో ఎన్నో అంశాలు పంచుకున్నారు. 1930 నుంచి 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్‌కప్‌లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందుపర్చినట్టు తెలిపారు. మొత్తం 19 భాగాల్లో ఆయా కాలాల్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు, ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే మధుర ఘట్టాలు, వివాదాలు సహా పలు అంశాలను కూలంక షంగా వివరించారు.
అదేవిధంగా భారత్ ఫుట్‌బాల్‌కి సంబంధించిన చరిత్రను సైత ం పొందుపరిచారు. నవతరం ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం ఆటకు సంబంధించి పలు సూచనలు సైతం ఉన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యేవారి కోసం ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి వంద క్విజ్ ప్రశ్నలను సైతం స్థానం కల్పించినట్టు పుస్తక రచయిత నవీ కపాడియా తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ అభిమానులకు గైడ్ ‘కిక్-ఆఫ్’
Published Sat, Jun 28 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement