Kick-off
-
Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోపం ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నిసార్లు తన చర్యతో అభిమానుల మనోభావాలను కూడా దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్‌కప్ అనంతరం క్రిస్టియానో రొనాల్డో కాస్త కొత్తగా కనిపించాడు. మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపుల తర్వాత అల్-నసర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న రొనాల్డో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడినప్పటికి ఆ తర్వాత అల్-నసర్ వరుస విజయాలతో దుమ్మురేపింది. అయితే సౌదీ ప్రోలీగ్‌లో భాగంగా శుక్రవారం అల్-ఇత్తిహాద్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో సేన 1-0తో ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయామన్న బాధలో పాత రొనాల్డో బయటికి వచ్చేశాడు. సహనం కోల్పోయిన రొనాల్డో పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా కనిపించిన వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడు. దెబ్బకు వాటర్ బాటిల్స్ చెల్లాచెదురయ్యాయి. ఒక వాటిర్ బాటిల్ ఎగిరి అభిమానుల మధ్య పడింది. అయితే ఎవరికి ఆ బాటిల్ తగల్లేదు. అయితే రొనాల్డో చర్యను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయనంత మాత్రానా ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. కోపంలో చేసే పని ఒక్కోసారి చేటు తెస్తుందని.. అందుకే కోపం తగ్గించుకుంటే మంచిదని హితబోధ చేశారు. అయితే రొనాల్డో కోపానికి ఇంకో కారణం కూడా ఉందని తెలిసింది. అదేంటంటే మ్యాచ్ జరుగుతున్నంత సేపు అల్-ఇత్తిహాద్ జట్టు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ నామస్మరణ చేశారు. రొనాల్డో కనిపించిన ప్రతీసారి మెస్సీ పేరు అతనికి వినపడేలా గట్టిగట్టిగా అరిచారు. ఈ చర్య కూడా అతని కోపానికి ఒక కారణం కావొచ్చు అని కొందరు పేర్కొన్నారు. అయితే తన చర్యపట్ల సిగ్గుపడిన రొనాల్డో కాసేపటి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అభిమానులను క్షమాపణ కోరాడు. ఇక మ్యాచ్‌లో ఆట 10వ నిమిషంలో అల్-ఇత్తిహాద్ తరపున బ్రెజిల్‌కు చెందిన రొమారినో గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇరుజట్లు పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు జరిపినప్పటికి మరో గోల్ రాలేదు. pic.twitter.com/26nxt7u4Ak — Out Of Context Football (@nocontextfooty) March 9, 2023 చదవండి: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు -
ఫుట్‌బాల్ అభిమానులకు గైడ్ ‘కిక్-ఆఫ్’
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్వైపే చూస్తోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులను గోల్స్ వర్షంలో తడిపేస్తున్నాయి. రోజుకో రసవత్తర పోరుతో ప్రేక్షకులు ఆనందలోకాల్లో విహరిస్తున్నారు. ఫుట్‌బాల్ వీరాభిమానుల్లో కొందరికి ఆట ఆడడం అంటే ఇష్టమైతే మరికొందరికి ఆ ఆటలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రతోపాటు ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మాత్రం ‘ది ఫుట్‌బాల్ ఫెంటాస్టిక్ ఎసెన్షియల్ గైడ్’ పుస్తకం చదవాల్సిందే. ‘కిక్-ఆఫ్’ పేరిట ప్రముఖ ఫుట్‌బాల్ నిఫుణుడు, ప్రముఖ వ్యాఖ్యాత నవీ కపాడియా ఈ పుస్తకాన్ని రచించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా తన పుస్తకానికి సంబంధించి రచయిత కపాడియా ‘సాక్షి’తో ఎన్నో అంశాలు పంచుకున్నారు. 1930 నుంచి 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచ ఫుట్బాల్కప్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందుపర్చినట్టు తెలిపారు. మొత్తం 19 భాగాల్లో ఆయా కాలాల్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు, ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే మధుర ఘట్టాలు, వివాదాలు సహా పలు అంశాలను కూలంక షంగా వివరించారు. అదేవిధంగా భారత్ ఫుట్‌బాల్‌కి సంబంధించిన చరిత్రను సైత ం పొందుపరిచారు. నవతరం ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం ఆటకు సంబంధించి పలు సూచనలు సైతం ఉన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యేవారి కోసం ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి వంద క్విజ్ ప్రశ్నలను సైతం స్థానం కల్పించినట్టు పుస్తక రచయిత నవీ కపాడియా తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.