Telangana: Job Notification For 1520 Vacancies In Health Department - Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌! తెలంగాణలో 1,520 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పే స్కేల్‌ ఎంతంటే?

Published Wed, Jul 26 2023 9:42 PM | Last Updated on Fri, Jul 28 2023 2:20 PM

Telangana MHSRB Notification 1520 Jobs In Medical Health Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. కమిషనర్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు నియామక బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన వివరాలు..
► అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌, మిడ్‌వైఫ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) ట్రైనింగ్‌ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి.

► అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు.

► హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050 

అప్లికేషన్‌ ఫీజు వివరాలు.. 
► ఆన్‌లైన్ అప్లికేషన్‌ ఫీజు రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. 

► ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

► హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement