సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్‌లో 1,026, కామర్స్‌లో 2,131, లైఫ్ సైన్స్‌లో 2,240, ఫిజికల్ సైన్స్‌లో 618, డేటాసైన్స్‌లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్‌లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment