Doston
-
దోస్త్ ద్వారా 6,843 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్‌లో 1,026, కామర్స్‌లో 2,131, లైఫ్ సైన్స్‌లో 2,240, ఫిజికల్ సైన్స్‌లో 618, డేటాసైన్స్‌లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్‌లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు. -
మోదీ ప్రసంగంలో ఆ 'పదం' ఏమైంది!
ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు ప్రసంగించినా.. 'మిత్రోం' అని జనాల్ని ఉద్దేశించి సంబోధించడం పరిపాటి. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం (డిసెంబర్ 31న) జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. 'మిత్రోం'కు బదులు 'దోస్తోం' అని సంబోధించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పేదలు, మహిళలు, పలువర్గాల వారికి రాయితీలు ప్రకటిస్తూ.. నోట్ల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇస్తూ మోదీ ప్రసంగం సాగినప్పటికీ.. ట్వీపుల్ (ట్విట్టర్ జనం) మాత్రం 'మిత్రోం' ఏమైందంటూ ఆరా తీశారు. మోదీ ప్రసంగంలో 'మిత్రోం' లేకపోవడం నిరాశపరిచిందంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ట్విట్టర్లో ప్రస్తుతం 'మిత్రో' పదం ట్రెండ్ అవుతోంది. ''మిత్రోం' నుంచి ఉర్దూ పదం 'దోస్తోం'కి మోదీ మారిపోయారు. క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యూలర్ నాయకుడిగా మారిపోయారు' అంటూ మాధవన్ నారాయణ్ ట్వీట్ చేయగా.. మోదీ మొదట మన నోట్లను దూరం చేశారు. ఇప్పుడు మనకు ఇష్టమైన 'మిత్రోం'ని కూడా దూరం చేస్తున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఈరోజు ప్రసంగంలో మోదీ 'మిత్రోం' అనలేదు. కొంపదీసి ఆయన మనల్ని అన్‌ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు చమత్కరించారు. డిమానిటైజేషన్ నుంచి డిమిత్రోనైజేషన్ జరిగినట్టుందని మరొకరు ట్వీట్ చేశారు.