మరో 361 పోస్టులకు నోటిఫికేషన్‌ | APPSC Latest Notification Dec 2016 - 361 posts of Dy | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు www. psc. ap. gov. in వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు కమిషన్‌ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. ఈ పోస్టుల కోసం జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement