సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 2022–23 సంవత్సరానికి ఏడాదికి సంబంధించి మొదటి సంవత్సరం బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ప్రవేశాలకు టీజీయూజీసెట్–22 అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 23న నిర్వహించనున్నట్లు కన్వీనర్ రోనాల్డ్‌రాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి సొసైటీ వెబ్‌సైట్(tswreis.in)లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 2021–22 సంవత్సరంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
11, 12 తేదీల్లో హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తునట్లు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సదస్సులో కాకతీయుల కాలం నాటి స్వతంత్ర సంస్థానాధీశుల చరిత్ర వివరిస్తారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సులో చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్ర ఔత్సాహికులు, యూనివర్సిటీ ఆచార్యులు తమ పరిశోధన పత్రాలను సమర్పిస్తారని వెల్లడించింది.
13లోగా ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి
ఏపీపీ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల (కేటగిరీ–7) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రాతపరీక్ష లో ఉత్తీర్ణులైన వారి తాత్కాలిక ఎంపిక వివరాలను అభ్యర్థుల సంబంధిత లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు tslprb.in సంబంధిత ఖాతాలకు లాగిన్ అయి ఎంపిక వివరాలను, ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను పూర్తిచేసి ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment