degree entrance exam
-
TGUGCET 2022: జనవరి 23న టీజీయూజీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 2022–23 సంవత్సరానికి ఏడాదికి సంబంధించి మొదటి సంవత్సరం బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ప్రవేశాలకు టీజీయూజీసెట్–22 అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 23న నిర్వహించనున్నట్లు కన్వీనర్ రోనాల్డ్‌రాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి సొసైటీ వెబ్సైట్(tswreis.in)లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 2021–22 సంవత్సరంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 11, 12 తేదీల్లో హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తునట్లు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సదస్సులో కాకతీయుల కాలం నాటి స్వతంత్ర సంస్థానాధీశుల చరిత్ర వివరిస్తారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సులో చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్ర ఔత్సాహికులు, యూనివర్సిటీ ఆచార్యులు తమ పరిశోధన పత్రాలను సమర్పిస్తారని వెల్లడించింది. 13లోగా ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి ఏపీపీ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల (కేటగిరీ–7) డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాతపరీక్ష లో ఉత్తీర్ణులైన వారి తాత్కాలిక ఎంపిక వివరాలను అభ్యర్థుల సంబంధిత లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు tslprb.in సంబంధిత ఖాతాలకు లాగిన్ అయి ఎంపిక వివరాలను, ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను పూర్తిచేసి ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు అప్లోడ్ చేయాలని తెలిపింది. -
గన్ వదిలి పెన్ పట్టిన మావోయిస్టులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జల్లాలో ఎస్పీ జోగ్గామోహన్ మిన్నా చొరవ మేరకు మావోయిస్టులు దళం వీడి జనజీవన స్రవంతిలో కలిసి గన్నులు వదిలిపెట్టి పెన్నులు చేతబట్టారు. 107మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. వారంతా ఎస్పీ ఆధ్వర్యంలో బ్యాచిలర్ ప్రిపరేషన్ ప్రోగ్రాం(బీపీపీ) కోర్సు పూర్తిచేసి బీఏ, బీకామ్‌లలో డిగ్రీ ప్రవేశాల కోసం శుక్రవారం ఎంట్రన్స్ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారంతా డిగ్రీలు పూర్తి చేయగలుగుతారని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రీజనల్ డైరెక్టర్ ఆర్. రాజగోపాల్ తెలిపారు. ఉత్తీర్ణులైన వారందరికీ డిగ్రీ కోర్సు ఉచితంగా చదివిస్తామని ఆయన చెప్పారు. బీపీపీ కోర్సు పూర్తి చేసిన వీరికి ఈ నెల రెండవ తేదీన ఒక పరీక్ష అయింది. శుక్రవారం మరో పరీక్ష నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టులు గన్లు వదిలిపెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దళం వదిలి రండి. చైతన్య వంతులు కండి అని పిలుపునిచ్చారు. -
మూడెకరాల నుంచి ఎకరానికి తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో ప్రవేశానికి ప్రస్తుతమున్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 40 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల రైతు పిల్లలకు రిజర్వేషన్ కల్పించారు. కనీసం మూడెకరాలున్న వారికి మాత్రమే ఆ 40 శాతంలో సీట్లు లభించేవి. దాన్ని ఎకరానికి కుదిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు రానున్నాయి. 49 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ద్వితీయ సం వత్సర పరీక్షల్లో 49 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మ్యాథ్స్–2ఏ, బోటనీ, సివిక్స్, సైకాలజీ పేపరు–2 సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 4,37,572 మంది హాజరయ్యారు. 4,57,292 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19,720 మంది గైర్హాజరయ్యారు. -
దగ్గరవుతున్న ‘దూర’ విద్య..!
► బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం ► ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు సువర్ణావకాశం ► 16తో ముగియనున్న గడువు ► మూడు జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ► యూజీ, పీజీ కోర్సుల్లో 23 వేల మంది అభ్యర్థులు నల్లగొండ: ఎలాంటి విద్యార్హత లేకుండా చదువుకోవాలనుకునే వారికి డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సువర్ణఅవకాశం కల్పిస్తోంది. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. అతి తక్కువ ఫీజుతో డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పించడంతో పాటు అన్ని రకాల స్టడీ మెటిరీయల్ అందుబాటులో ఉంచుతోంది. అడ్మిషన్లలో రాష్ట్రంలో నల్లగొండ రీజియన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధ్యయన కేంద్రాలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎన్ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ఎస్వీ డిగ్రీ కాలేజీ (సూర్యాపేట), ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (దేవరకొండ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (నాగార్జునసాగర్), రామకృష్ణ డిగ్రీ కాలేజీ (హాలియా), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మిర్యాలగూడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (హుజూర్నగర్), కేఆర్ఆర్ జూనియర్ కాలేజీ (కోదాడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీలు (ఆలేరు,భువనగిరి), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (రామన్నపేట). డిగ్రీలో ప్రవేశానికి అర్హులు వీరు.... ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరేందుకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు నేరుగా ఆన్లైన్లో డిగ్రీలో చేరొచ్చు. అదేవిధంగా ఐటీఐ, వృత్తి విద్య ఇంటర్ చేసిన వారు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా డిగ్రీలో చేరాలనుకునే వారు యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు రూ.1450 చెల్లించాలి. అర్హత పరీ క్ష రాసిన వారు రూ.1300 ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. అభ్యర్థులు 24 తరగతులు ఉంటాయి. అర్హత పరీక్ష సూచనలు అర్హత పరీక్ష –2017 రాసే అభ్యర్థులు ఆన్లైన్లో డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్ www. bsoauonine.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీకు కావాల్సిన సమచారానికి సమీపంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు పూర్తిచేయోచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300లు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా రూ.310లు సమీపంలోని ఏపీ/టీఎస్ ఆన్లైన్ ప్రాంచైజ్ సెంటర్లలో చెల్లించాలి. సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ ఫోటో సైజు తప్పనిసరిగా ఆన్లైన్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. మీ మొబైల్ ఫోన్ నంబర్ లేదా స్నేహితుల ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి. దీం తో యూనివర్సిటీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెంటనే పంపగలుగుతారు. దరఖాస్తులకు స్వీరణకు చివరి తేదీ ఈ నెల 16 ప్రవేశ పరీక్ష 26 తేదీన పరీక్ష నిర్వహించే సమయం: ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు. అతి తక్కువ ఫీజుతో విద్యనందిస్తున్నాం దేశంలోనే అతితక్కువ ఫీజుతో విద్యనందిస్తోంది డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మూడు జిల్లాల్లో కలిపి 23 వేల మంది అభ్యర్థులు యూజీ, పీజీ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. దీంట్లో 65 శాతం మంది మహిళలే ఉండటం గర్వకారణం. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయడం జరుగుతుంది. ఎలాంటి విద్యార్హత లేని వారి కూడా డిగ్రీలో చేరేలా అవకాశం కల్పించి వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నాం. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాలి. – డాక్టర్ బి.ధర్మానాయక్ (రీజియన్ కోఆర్డినేటర్)