► బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఆహ్వానం
► ఎలాంటి విద్యార్హత లేకుండా డిగ్రీలో చేరేందుకు సువర్ణావకాశం
► 16తో ముగియనున్న గడువు
► మూడు జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
► యూజీ, పీజీ కోర్సుల్లో 23 వేల మంది అభ్యర్థులు
నల్లగొండ: ఎలాంటి విద్యార్హత లేకుండా చదువుకోవాలనుకునే వారికి డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సువర్ణఅవకాశం కల్పిస్తోంది. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. అతి తక్కువ ఫీజుతో డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పించడంతో పాటు అన్ని రకాల స్టడీ మెటిరీయల్ అందుబాటులో ఉంచుతోంది. అడ్మిషన్‌లలో రాష్ట్రంలో నల్లగొండ రీజియన్ సెంటర్ ప్రథమ స్థానంలో నిలిచింది. మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కాలేజీలో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అధ్యయన కేంద్రాలు
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని 13 అధ్యయన కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎన్ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ఎస్వీ డిగ్రీ కాలేజీ (సూర్యాపేట), ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (దేవరకొండ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (నాగార్జునసాగర్), రామకృష్ణ డిగ్రీ కాలేజీ (హాలియా), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (మిర్యాలగూడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (హుజూర్‌నగర్), కేఆర్‌ఆర్ జూనియర్ కాలేజీ (కోదాడ), ప్రభుత్వ జూనియర్ కాలేజీలు (ఆలేరు,భువనగిరి), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (రామన్నపేట).
డిగ్రీలో ప్రవేశానికి అర్హులు వీరు....
ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో చేరేందుకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు నేరుగా ఆన్‌లైన్‌లో డిగ్రీలో చేరొచ్చు. అదేవిధంగా ఐటీఐ, వృత్తి విద్య ఇంటర్ చేసిన వారు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా డిగ్రీలో చేరాలనుకునే వారు యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు రూ.1450 చెల్లించాలి. అర్హత పరీ క్ష రాసిన వారు రూ.1300 ట్యూషన్ ఫీజుగా చెల్లించాలి. అభ్యర్థులు 24 తరగతులు ఉంటాయి.
అర్హత పరీక్ష సూచనలు
అర్హత పరీక్ష –2017 రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డా.బీర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్ www. bsoauonine.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మీకు కావాల్సిన సమచారానికి సమీపంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు పూర్తిచేయోచ్చును.
రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300లు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా రూ.310లు సమీపంలోని ఏపీ/టీఎస్ ఆన్‌లైన్ ప్రాంచైజ్ సెంటర్లలో చెల్లించాలి.
సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ ఫోటో సైజు తప్పనిసరిగా ఆన్‌లైన్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.
మీ మొబైల్ ఫోన్ నంబర్ లేదా స్నేహితుల ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి. దీం తో యూనివర్సిటీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెంటనే పంపగలుగుతారు.
దరఖాస్తులకు స్వీరణకు చివరి తేదీ ఈ నెల 16
ప్రవేశ పరీక్ష 26 తేదీన
పరీక్ష నిర్వహించే సమయం: ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.
అతి తక్కువ ఫీజుతో విద్యనందిస్తున్నాం
దేశంలోనే అతితక్కువ ఫీజుతో విద్యనందిస్తోంది డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. మూడు జిల్లాల్లో కలిపి 23 వేల మంది అభ్యర్థులు యూజీ, పీజీ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు. దీంట్లో 65 శాతం మంది మహిళలే ఉండటం గర్వకారణం. ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయడం జరుగుతుంది. ఎలాంటి విద్యార్హత లేని వారి కూడా డిగ్రీలో చేరేలా అవకాశం కల్పించి వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నాం. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాలి.
– డాక్టర్ బి.ధర్మానాయక్ (రీజియన్ కోఆర్డినేటర్)