pg medical counselling
-
పీజీ మెడికల్ కన్వీనర్ సీట్ల తుది విడత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి శని, ఆదివారాల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి, రెండు, మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తయింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఈ మాప్‌అప్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. కాలేజీల వారీగా ఖాళీలను వెబ్సైట్లో పొందుపరిచారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాధాన్య క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. తగ్గించిన నీట్ అర్హత కటాఫ్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో కూడిన రివైజ్డ్ తుది మెరిట్ జాబితాను వర్సిటీ విడుదల చేసింది. ఆ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు కోరారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కాని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు, అలాగే ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. -
చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్
విజయవాడ: పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల చివరి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ పూర్తయిన విషయం విదితమే. ప్రభుత్వ కళాశాలల్లో 23 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 262 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 120, ఏయూ పరి ధిలో 94, ఎస్వీయూ పరిధిలో 48 సీట్లు ఉన్నాయి. -
29 నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ : 2015-16 విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-సర్వీస్ అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి మే 5 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్ తొలి మూడు రోజులు ఓపెన్ కేటగిరీ సీట్లకు, మే 2 నుంచి 5 వరకు రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. సర్వీస్ అభ్యర్థులకు మే 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో 6వ తేదీ ఓపెన్ కాంపిటీషన్ సీట్లకు, 7న రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ రెండో విడత నోటిఫికేషన్‌తో పాటు తరువాత ప్రకటిస్తారు. సీట్ మ్యాట్రిక్స్ కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రూ.2 వేల డీడీని ది రిజిస్ట్రార్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో చెల్లించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.15,600, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.20,600 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఫీజులు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు, మరిన్ని వివరాలు, యూనివర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు. -
'ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్'
నెల్లూరు: ఈ నెలాఖరు నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరగనున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైఎస్ చాన్స్‌లర్ డా. రవిరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మే 10నాటికి మొదటి దశ పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ హెల్త్ యూనివర్శిటీలో ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. గత ఏడాదిలాగానే కౌన్సెలింగ్ జరుగుతుందని డా. రవిరాజు చెప్పారు. -
పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు బ్రేక్
సాక్షి, విజయవాడ: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా మెడికల్ కౌన్సెలింగ్ మూడో రోజు శుక్రవారం అర్ధంతరంగా ఆగిపోయింది. పీజీ సీట్లు కే టాయించేందుకు తయారుచేసిన సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఆ తరువాత సీట్ మ్యాట్రిక్స్లో లోపాలు గుర్తించిన అధికారులు కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సీట్లు కేటాయించే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగి జాతీయ రహదారిపై వాహనాలను నిలిపేశారు. తమకు న్యాయం చేయాలంటూ వర్సిటీ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అడ్డుకున్నారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం కౌన్సెలింగ్‌ను రద్దుచేసే దిశగా ఆలోచిస్తున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. శనివారంనాటి కౌన్సెలింగ్ ఆదివారానికి వాయిదావేస్తున్నామని, శనివారం ఒక నిర్ణయం తీసుకుంటామని వీసీ ‘సాక్షి’కి తెలిపారు.