మెడికల్ పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లమో కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2014-15) అడ్మిషన్లకుగాను ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
విజయవాడ, మెడికల్ పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లమో కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2014-15) అడ్మిషన్లకుగాను ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నగరాల్లోని 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వర్సిటీ నుంచి శనివారం ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఆయా నగరాలకు తరలించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహించే ఈ పరీక్షకు అర్ధగంట ముందుగానే విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. సమయం ముగిసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని విశ్వవిద్యాలయ అధికారులు చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 15,743 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.