కామినేని కట్టుకథలు | Kamineni Srinivas Fake Promises in Eluru | Sakshi
Sakshi News home page

కామినేని కట్టుకథలు

Published Sun, Apr 28 2024 1:31 PM | Last Updated on Sun, Apr 28 2024 2:00 PM

Kamineni Srinivas Fake Promises in Eluru

బిల్డప్‌ బాబాయ్‌

కొల్లేరుపై మళ్లీ అవే బూటకపు హామీలు

కూటమి ఉంటేనేకైకలూరులో కనిపించే నేత

సెంటిమెంట్‌ మాటలు.. ఒట్టు వేసి మరీ హామీలు

గెలిచే వరకు కైకలూరు.. ఆ తర్వాత వేరే ప్రాంతాల్లో..

మళ్లీ ప్రజలను మభ్యపెడుతూ కామినేని ప్రచారం   

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒట్టు వేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. ఇది పాపులర్‌ సినిమా డైలాగ్‌. అయితే ఈ నేత మాత్రం ఒట్టు వేసి మరీ చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే కొల్లేటిలో కలిపేస్తారు. మళ్లీ ఎన్నికలు రాగానే అవే హామీలు, మాటలను మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. ఆయనే కైకలూరు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌. తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని.. కొల్లేరు సమస్యలు నరేంద్ర మోదీతో మాట్లాడి సెటిల్‌ చేస్తానని.. జలజీవన్‌ మిషన్‌ మనదేనని.. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని ఇలా బిల్డప్‌ బాబాయ్‌ మాదిరిగా అడ్డగోలుగా మాటలు చెబుతూ రాజకీయం చేస్తుంటారు. కేవలం మూడు పారీ్టలు ఉంటేనే కూటమి బీజేపీ అభ్యరి్థగా బరిలో నిలవడం, మూడు పారీ్టలు లేకపోతే బీజేపీని స్థానికంగా గాలికి వదిలేసి విదేశాల్లో ఉండటం ఆయనకు సర్వసాధారణం. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇలాంటి మోసపూరిత హామీలు, ఒట్లతో కామినేని కైకలూరులో ప్రచారం చేస్తున్నారు.  

జెండాలు జతకడితేనే.. 
కామినేని శ్రీనివాస్‌ తనని తాను బీజేపీ నేతగా అభివరి్ణంచుకుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యరి్థగా కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అయితే బడా వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాలతో బీజేపీ పెద్దాయన సూచనలతో 2014లో బీజేపీలో చేరి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మొదటిసారి గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్‌లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. కట్‌ చేస్తే.. 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, అమెరికాకు పరిమితమై స్థానిక బీజేపీని పూర్తిగా నిరీ్వర్యం చేసి టీడీపీ నేతలకు సహకారం అందించారు. ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు కైకలూరు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పొత్తు ఆశలు చిగురించడం, మూడు పార్టీల చర్చలు మొదలు కావడంతో మళ్లీ కైకలూరు తనదేనంటూ హడావుడి మొదలుపెట్టి జెండా.. అజెండా లేకుండా నియోజకవర్గంలో కొద్దిరోజులు తిరిగారు. టికెట్‌ ఖరారు కావడంతో బీజేపీ అభ్యరి్థగా మళ్లీ తిరుగుతున్నారు.  

పెద్దింట్లమ్మపై ఒట్టు 
కామినేని శ్రీనివాస్‌కు ఒట్లు వేయడం బాగా అలవాటు. ఒక్కోసారి ఒక్కో దేవుడిని వాడుకుంటారు. ఒకసారి కాణిపాకం వినాయకుడు, మరో సారి కైకలూరు శ్యామలాంబ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, ఆయన స్వగ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఇలా అందరిపైనా ఒక రౌండ్‌  ఒట్లు వేసేశారు. 2014లో  కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మిస్తానని కొల్లేటికోట పెద్దింట్లమ్మపై ఒట్టు వేసి నెరవేర్చని కామినేని తిరిగి మళ్లీ ఇటీవల అమ్మవారిపై కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తానని ఒట్టు వేశారు. చనిపోయిన తన అమ్మ చివరి కోరిక ఎమ్మెల్యే కావడం.. భవిష్యత్తులో ఇక పోటీ చేయనని, ఈసారి కొత్తగా అమ్మ సెంటిమెంట్‌తో జనాల్లోకి వెళుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement