తిరుపతి: చిత్తూరు జిల్లా రేణుగుంటలో మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం నిర్వహించిన సభ రసాభాసగా మారింది. ఈ సమావేశం ప్రారంభం కాగానే ప్రభుత్వాసుపత్రికి వైద్యులు సకాలంలో రావడం లేదని.. మంత్రి కామినేని శ్రీనివాస్ను టీడీపీ జెడ్పీటీసీ లీలావతమ్మ నిలదీసింది. దాంతో కామినేని శ్రీనివాస్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లీలావతమ్మ తీరుపరై కామినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైక్ పడేసి సమావేశం నుంచి మంత్రి కామినేని వెళ్లిపోయారు.