leelavathi
-
Leelavathi: ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సుమలత పోస్ట్ వైరల్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్‌హౌస్‌లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
అవ్వకు అలంబన
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కావల్సిన వారు కానివారవుతున్నారు. 70 ఏళ్ల లీలావతి దుబేకు కూడా అలాంటి కష్టమే వచ్చింది. కడుపున పుట్టిన పిల్లలు కాదు పొమ్మంటే దిక్కులేనిదానిలా రోడ్డున పడింది. కానీ, మనుషుల్లో దాగున్న మంచితనంతో ఆమెకో కొత్త కుటుంబం దగ్గరయ్యింది. ముసలి వయసులో ఓ ఆలంబన దొరికింది. కరోనా టైమ్‌లో లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయ్‌లో ఉంటున్న కేదార్‌నాథ్‌కి భార్యాపిల్లలతో పాటు తల్లిని సాకడం కష్టమై ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టాడు. పెద్దకొడుకు కాదనడంతో ఢిల్లీలో ఉన్న రెండవ కొడుకు దగ్గరకు వెళ్లడానికి ముంబయ్ రైల్వేస్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది లీలావతి. కొడుకు దగ్గరకు వెళ్లడానికి లీలావతి వద్ద రూపాయి కూడా లేదు. మనసును కదిలించే ఈ లీలావతి కథను యూట్యూబ్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇది చూసిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త లీలావతిని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆమెను నానమ్మగా భావించి, తనతోనే ఉండిపొమ్మన్నాడు. ‘లీలావతి నానమ్మకు కరోనా పరీక్ష చేయించాను. తను ఆరోగ్యంగా ఉంది. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటుంది. మా కుటుంబంలోకి కొత్తగా నానమ్మ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. నానమ్మ కూడా సంతోషంగా ఉండటం గమనిస్తున్నాను’ అంటూ ఆనందిస్తున్నాడు కిరణ్. కరోనా అయినవారి మధ్య చిచ్చు పెట్టింది. కడుపున పుట్టిన బిడ్డలు కూడా కాదు పొమ్మంటున్న పరిస్థితులు వచ్చి పడ్డాయి. అయినా, మనుషుల్లో మానవత్వం దాగి ఉందని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. -
తోటకు నిప్పు ..నటి కన్నీరు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలో సీనియర్ నటి లీలావతికి చెందిన తోటకు బుధవారం నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న లీలావతితోపాటు ఆమె కుమారుడు, కన్నడ హీరో వినోద్‌రాజ్ కూలీలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చినప్పటికీ తోట గేట్ ఇరుకుగా ఉండడంతో ఫైరింజన్ లోపలకు రావడానికి వీలుకాలేదు. ఆకతాయిలు సిగరెట్ తాగి వేయడంతో మంటలు వ్యాపించి ఉంటాయని వినోద్‌రాజ్ అభిప్రాయపడ్డారు. తోటలో పూలు,పండ్ల చెట్లు పెంచుతున్నారు. పశుపక్ష్యాదులకు ఆశ్రయం కల్పించారు. ప్రాణంగా చూసుకుంటున్న తోట కళ్లముందే కాలిపోవడంతో లీలావతి కన్నీరుమున్నీరయ్యారు. -
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య
కండ్లపల్లి, (పామిడి): మతిస్థిమితం లేని ఓ వివాహిత ఇంటి గవాచీ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కండ్లపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలమేరకు... అనంతపురానికి చెందిన లీలావతికి కండ్లపల్లి గ్రామానికి చెందిన వీరాంజనేయులుతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లైన ఏడాదికే లీలావతి మతిస్థిమితాన్ని కోల్పోయింది. బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా ఆమె ఉరివేసుకొంది. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీలో ఆమె మృతదేహాన్ని గుత్తి ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ ఆమె ఆత్మహత్యపై వివరాలను ఎస్ఐతో అడిగి తెలుసుకున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించకుండానే త్రీటౌన్ పోలీసులు అర్దరాత్రి కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి తండ్రి డిల్లీరావు కథనం మేరకు... నగరంలోని లెక్చరర్స్ కాలనీలో నివాసముంటున్న లీలావతిబాయి(45), ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసరావు దంపతులు. వీరికి డిగ్రీ చదివే కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి. గతంలో పలుమార్లు భర్తతో విభేదించి లీలావతిబాయి పుట్టింటికి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆమెను భర్త హింసించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను చూసేందుకు ఇంటికి వస్తే కొట్టి పంపించేవాడని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం సాయంత్రం లీలావతిబాయి చనిపోతే తల్లిదండ్రులకు గానీ, మీడియాకు గానీ సమాచారం అందించలేదు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమకు ఇష్టమైన వ్యక్తులు చనిపోయారని, పుట్టింటి వారు ఆదరించడం లేదని మనస్థాపంతో లీలావతిబాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తండ్రి ఢిల్లీరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అల్లుడే చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేశారు. తన చిన్న కుమారున్ని లోబరుచుకుని పోలీసుల సహకారంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
దయలేని దేవుడు
- పది రోజుల కిందట భార్య మృతి - డెత్ సర్టిఫికెట్ కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం - మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు.. దయలేని దేవుడు.. చిన్నచూపు చూశాడు. వృద్ధాప్యంలో తోడు లేకుండా చేశాడు. పది రోజుల కిందట భార్య చనిపోగా.. ఆ వియోగం నుంచి ఇంకా అతను పూర్తిగా కోలుకోలేకపోయాడు. భార్య డెత్ సర్టిఫికెట్ కోసం వస్తున్న అతనిపై మృత్యువు పగబట్టింది. అప్పటి వరకు తాను ప్రయాణించి వచ్చిన బస్సు చక్రాల కిందే పడి అతను మరణించారు. వరుసగా జరిగిన ఘటనతో వారి ఏకైక కుమార్తె కన్నీరుమున్నీరైంది. మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగాయి. తాడిపత్రి టౌన్ : తాడిపత్రి ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో బస్సు కింద పడి బందార్లపల్లికి చెందిన నాగప్ప(65) మరణించారు. పట్టణ ఎస్ఐ ఆంజనేయులు కథనం మేరకు...నాగప్పకు మగపిల్లలు లేరు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెను కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు పెళ్లి చేసిచ్చారు. నాగప్ప తన భార్యతో కలసి బందార్లపల్లిలోనే ఉండేవారు. అయితే పది రోజుల కిందట భార్య చనిపోగా, అప్పటి నుంచి ఆయన కుమార్తె వద్ద ఉండేవారు. భార్య మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం తుమ్మలపెంట నుంచి తాడిపత్రికి బుధవారం బయలుదేరి వచ్చారు. బస్సు దిగి దిగుతుండగానే డ్రైవర్ షెక్షావలి నిర్లక్ష్యంతో బస్సును నడపడంతో అతను కిందపడ్డారు. దీంతో తలకు పెద్ద గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. పాత కొత్తచెరువు వద్ద రిటైర్డ్ వైద్యురాలు.. గుంతకల్లు రూరల్ : గుత్తి-గుంతకల్లు రహదారిలోని పాత కొత్తచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లీలావతి(64) మరణించారు. గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో ఆమె ఈఎన్టీ స్పెషలిస్ట్‌గా మెరుగైన సేవలందించి, ఈ ప్రాంత ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం ఐదేళ్లుగా ఆమె గుంతకల్లులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో ధర్మవరంలోని బంధువులను కలిసేందుకు బుధవారం ఉదయం తన కారు డ్రైవర్ మునిరాజుతో కలసి బయలుదేరారు. మార్గమధ్యంలోని పాతకొత్తచెరువు వద్దకు రాగానే ఎదురుగా విపరీతమైన వేగంతో వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో లీలావతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, డ్రైవర్ మునిరాజు స్వల్పంగా గాయపడ్డారు. వారిద్దరినీ 108లో గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే లీలావతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి వద్దనున్న సుమారు రూ.3 లక్షలకు పైగా నగదును ఆమె బంధువులకు 108 సిబ్బంది అప్పజెప్పి తమ నిజాయితీ చాటుకున్నారు. -
మైక్ పడేసి సమావేశం నుంచి వెళ్లిపోయిన మంత్రి
-
మైక్ పడేసి సమావేశం నుంచి వెళ్లిపోయిన మంత్రి
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణుగుంటలో మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం నిర్వహించిన సభ రసాభాసగా మారింది. ఈ సమావేశం ప్రారంభం కాగానే ప్రభుత్వాసుపత్రికి వైద్యులు సకాలంలో రావడం లేదని.. మంత్రి కామినేని శ్రీనివాస్‌ను టీడీపీ జెడ్పీటీసీ లీలావతమ్మ నిలదీసింది. దాంతో కామినేని శ్రీనివాస్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లీలావతమ్మ తీరుపరై కామినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైక్ పడేసి సమావేశం నుంచి మంత్రి కామినేని వెళ్లిపోయారు. -
నవ వధువు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నవ వధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నగరంలోని మల్కాజ్గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లీలావతి అనే యువతికి 8 నెలల క్రితం శశికిరణ్కు వివాహమైంది. లీలావతి సోమవారం రాత్రి అనూహ్యంగా ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు శశికిరణ్ చెబుతున్నాడు. వరకట్న వేధింపులే కారణమని, భర్తే హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మల్కాజ్ గిరిలోని అతని ఇంటి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
'మిస్ లీలావతి' స్టిల్స్
-
ప్రణయం ప్రళయమైతే...
ఎన్నో యుద్ధాలు, ప్రళయాలు మనిషి వల్లే ఇప్పటిదాకా సంభవించాయి. స్త్రీ, పురుష సంబంధాలకు ఇదే వర్తిస్తుందన్న కథాంశంతో హుద్‌హుద్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేశ్ ముఖ్యతారలుగా శ్రావ్య ఫిలింస్ పతాక ంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రానికి పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘సెన్సార్ పూర్తయింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య.