స్వయంగా మంటలార్పుతున్న వినోద్‌రాజ్ ,కన్నీరుమున్నీరవుతున్న లీలావతి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా సోలదేనహళ్లిలో సీనియర్ నటి లీలావతికి చెందిన తోటకు బుధవారం నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న లీలావతితోపాటు ఆమె కుమారుడు, కన్నడ హీరో వినోద్‌రాజ్ కూలీలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చినప్పటికీ తోట గేట్ ఇరుకుగా ఉండడంతో ఫైరింజన్ లోపలకు రావడానికి వీలుకాలేదు. ఆకతాయిలు సిగరెట్ తాగి వేయడంతో మంటలు వ్యాపించి ఉంటాయని వినోద్‌రాజ్ అభిప్రాయపడ్డారు. తోటలో పూలు,పండ్ల చెట్లు పెంచుతున్నారు. పశుపక్ష్యాదులకు ఆశ్రయం కల్పించారు. ప్రాణంగా చూసుకుంటున్న తోట కళ్లముందే కాలిపోవడంతో లీలావతి కన్నీరుమున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment