హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: మేరుగ | Have to declare Health emergency: meruga | Sakshi
Sakshi News home page

హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: మేరుగ

Published Tue, Sep 20 2016 1:02 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: మేరుగ - Sakshi

హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: మేరుగ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా విషజ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రజలను ఆదుకోవడానికి తక్షణం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేసింది.

పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలియని వ్యక్తి కామినేని శ్రీనివాస్ ఆరోగ్య మంత్రిగా ఉండటం దారుణమన్నారు. విధి నిర్వహణలో విఫలమైన మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విషజ్వరాలపై తక్షణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement