కొల్లేరు ప్రజలకు ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని కైకలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు.
కృష్ణా(కైకలూరు) : కొల్లేరు ప్రజలకు ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడిఉన్నాయని కైకలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) నివాసగృహం వద్ద ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ నెలలో కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, వెంకయ్యనాయుడులను తీసుకొచ్చి హెలికాప్టర్ ద్వారా కొల్లేరును ఏరియల్ సర్వే చేస్తామన్నారు.
అనంతరం కొల్లేరు ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. సీఎం చంద్రబాబుతో ఇటీవల కొల్లేరు చేపల చెరువులపై రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిపామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7500 ఎకరాల చేపల చెరువుల భూములను తిరిగి పంపిణీ చేయడానికి మంత్రుల కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. కొల్లేరు అభయారణ్యంలో జీరో సైజు చేపపిల్లల పెంపకానికి అటవీశాఖ అధికారులు కొల్లేరు ప్రాంత రైతులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.