‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’ | Minister Kamineni Srinivas condemns his join to TDP | Sakshi
Sakshi News home page

‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’

Published Wed, Aug 23 2017 1:04 PM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’ - Sakshi

‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’

విజయవాడ: తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన బుధవారమిక్కడ తోసిపుచ్చారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ప్రాణం ఉన్నంత వరకూ బీజేపీలోనే కొనసాగుతానని కామినేని స్పష్టం చేశారు.

కాగా మంత్రి కామినేని బీజేపీని వీడి టీడీపీలో చేరుతారనే వార్తలు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై కామినేని స్పందిస్తూ తన మంత్రిగా తాను ఎదగడానికి, బీజేపీతో పాటు వెంకయ్య నాయుడి ప్రోత్సహం కూడా ఉందన్నారు. పొత్తుల నేపథ్యంలో బీజేపీ నుంచి గెలుపొందిన ఆయన చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే సొంత పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ మిత్ర‌పక్షానికి లబ్ధి చేకూరేలా చేస్తున్నార‌ని కామినేనిపై బీజేపీ నేతలే పలుమార్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement