కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు.
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆంధ్రాహార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. పుష్కరాల ప్రభావం సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులపైనే ఉంటుందని, వారు సమీప కళాశాలకు సెంటర్‌కు మార్పుచేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లోని నిరుపేద రోగులకు సేవ చేసేలా ఒక విధానాన్ని అమలుచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.