రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నా, కొందరు ప్రత్యేక హోదా అవసరమంటూ రాద్ధాంతం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
- రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మంత్రి కామినేని
చిల్లకూరు(నెల్లూరు జిల్లా)
రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నా, కొందరు ప్రత్యేక హోదా అవసరమంటూ రాద్ధాంతం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని వరగలి, వల్లిపేడు ఆరోగ్య కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వరగలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా విషయంపైనే చర్చిస్తున్నారని, నిధులనిస్తున్నా రాద్ధాంతం చేయడం తగదని పేర్కొన్నారు. హోదా విషయం కేంద్రం తేల్చాల్సిందేనని ముక్తాయించారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి ఆస్పత్రిలో స్పెషలిస్టులు ఉండేలా చూస్తామన్నారు. క్లస్టర్ వ్యవస్థ రద్దుతో డివిజన్ స్థాయిలో అడిషనల్ డీఎం అండ్ హెచ్‌ఓలను నియమించి వైద్య సేవలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.