విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కోరికి నవజాత శిశువు మృతి చెందిన ఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ ఘటనపై విచారణకు సర్కార్ ముందుకు రాలేదు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ఈ ఘటనపై ఇంకా విచారణకు ఆదేశాలు వెలువడలేదు.
కాగా ఈ ఘటనపై విచారణ జరపాలన్న తమ డిమాండ్ను ఏపీ సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే సదరు శిశువు సహజ మరణంగానే భావిస్తున్నట్లు వైద్యుల అభిప్రాయాన్ని మంత్రి పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అందువల్లే ఈ ఘటనపై విచారణకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిసింది.