కామినేనీ.. ఇదేమి..! | Reduce Infant Mortality in AP: Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

కామినేనీ.. ఇదేమి..!

Published Tue, Mar 22 2016 8:17 AM | Last Updated on Sat, Jun 2 2018 4:30 PM

కామినేనీ.. ఇదేమి..! - Sakshi

కామినేనీ.. ఇదేమి..!

శిశు మరణాల రేటును 28కి తగ్గించామన్న మంత్రి
ఏపీలో శిశు మరణాల రేటు 35గా పేర్కొన్న కేంద్రం

 
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అవాస్తవాలు వల్లించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు టీడీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంద సంవత్సరాలు జీవించాల్సినవారు పుట్టిన వారానికే చనిపోతున్నారు.. గత ప్రభుత్వాల తప్పిదాలే ఇందుకు కారణమని విమర్శించారు. గతంలో ప్రతి 1,000 మంది శిశువుల్లో 41 మంది మృతి చెందేవారని (శిశు మరణాల రేటు), ఇప్పుడు ఆ రేటును 28కి తగ్గించామని చెప్పారు.

అయితే నెల రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ బులెటిన్ ఏపీలో శిశు మరణాల రేటును ప్రతి వెయ్యికీ 35గా పేర్కొనడం గమనార్హం. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి గత పదేళ్లలో ఒక్క నియామకమూ జరగలేదని కామినేని చెప్పారు. కానీ ఉమ్మడి ఏపీలో అంటే 2007లో అప్పటి ముఖ్యమంత్రి 4 వైద్య కళాశాలలు (రిమ్స్‌లు) ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు 3 వేల మంది నియమితులు కావడం గమనార్హం.

వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను ప్రైవేటుకు లీజుకు ఇస్తున్నారు. రక్తపరీక్షల నిర్వహణను సైతం ప్రైవేటుకు అప్పగించారు. దీనికి సంబంధించిన రూ.120 కోట్ల కాంట్రాక్టును ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టారు. మెడాల్ సంస్థ అద్భుతంగా పనిచేస్తోందని కామినేని కితాబిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement