mortality rate
-
ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ఇన్షెక్షన్‌తో పోలిస్తే నిఫా వైరస్‌తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2–3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్‌తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. యాంటీబాడీ డోసుల కొనుగోలుపై రాజీవ్ బహల్ స్పందిస్తూ..ఆస్ట్రేలియా నుంచి 2018లో తెప్పించిన కొన్ని డోసులు ఇప్పటికీ ఉన్నాయనీ, అవి 10 మంది బాధితులకు మాత్రమే సరిపోతాయని వివరించారు. భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు. వీరికి మోనోక్లోనల్ యాంటీబాడీలను ఇవ్వగా అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ‘అయితే, ఈ యాంటీబాడీలను ప్రారంభదశలో ఉన్న వారికే వాడుతున్నారు. వీటితో చికిత్సపై నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం, వైద్యులు, వైరస్ బాధితుల కుటుంబాలకే వదిలేశాము. మోనోక్లోనల్ యాంటీబాడీలతో విదేశాల్లో భద్రతను నిర్థారించే ఫేజ్–1 ట్రయల్ మాత్రమే జరిగింది. సామర్థ్యాన్ని నిర్థారించే ట్రయల్స్ జరగలేదు. అందుకే దీనిని ‘కారుణ్య వినియోగ ఔషధం’గా మాత్రమే వాడుతున్నారు’అని రాజీవ్ వివరించారు. చదవండి: ముగిసిన ఈడీ డైరెక్టర్ పదవీకాలం -
టీబీ బాధితుల్లో మరణాల ముప్పు ఎక్కువే
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి బాధితుల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటోందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యుబర్క్యులోసిస్(ఎన్ఐఆర్టీ) తెలిపింది. క్షయ బాధితుల ఆయుర్దాయం తక్కువేనని పేర్కొంది. ఆధునిక వైద్య చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చిన కారణంగా ఇటీవలి కాలంలో క్షయ బాధిత మరణాలు క్రమేపీ తగ్గుతున్నాయని చెన్నైలోని ఎన్ఐఆర్టీ డైరెక్టర్ పద్మా ప్రియదర్శిని చెప్పారు. అయితే, చికిత్స పూర్తి చేసుకున్న బాధితుల ఆయుర్దాయం రేటు ఆందోళనకరంగానే ఉంటోందని అన్నారు. మిగతా వారితో పోలిస్తే టీబీ వ్యాధి బాధితుల్లో అకాల మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. చికిత్స పూర్తయిన తర్వాతి సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించామన్నారు. బాధితుల్లో మహిళల కంటే పురుషులకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణయిందన్నారు. -
గుండెను గాబరా పెట్టకండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. అందులో పేర్కొన్న ప్రకారం 2020లో రాష్ట్రంలో 4,55,000 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 22.3 శాతం అంటే 1,01,353 మరణాలను వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు ధ్రువీకరించిన మరణాల్లో 60.6 శాతం మరణాలు ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన హార్ట్ఎటాక్, కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి), అరిథ్మియా సహా పలు రకాల జబ్బుల కారణంగా సంభవించాయి. ఈ వ్యాధుల కారణంగా 61,395 మరణాలు నమోదు కాగా మృతుల్లో అత్యధికంగా పురుషులే ఉన్నారు. మృతుల్లో పురుషులు 39,677 మంది కాగా.. మహిళలు 21,718 మంది ఉన్నారు. రెండో స్థానంలో కరోనా సంబంధిత సమస్యల కారణంగా 12 శాతం, మూడో స్థానంలో శ్వాసకోశ వ్యాధులతో 7.2 శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో 9,751 మందిలో వైరస్ నిర్ధారణ అవగా, 2,442 మందిలో వైరస్ నిర్ధారణ కాలేదు. అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో 7,328 మరణాలు సంభవించగా.. ఇందులో న్యూమోనియాతో 4,085 మరణాలు నమోదయ్యాయి. క్రమంగా పెరుగుతున్న ధ్రువీకరణ మరణాలు రాష్ట్రంలో మరణాల రిజిస్ట్రేషన్, వైద్యుల ధ్రువీకరణ శాతం క్రమంగా పెరుగుతోంది. 2019లో రాష్ట్రంలో 4,01,472 మరణాలు రిజిస్టర్ కాగా.. ఇందులో కేవలం 12.9 శాతం మరణాలను మాత్రమే వైద్యులు ధ్రువీకరించారు. 2020 సంవత్సరానికి వైద్యుల ధ్రువీకరణ 22.3 శాతానికి పెరిగింది. ఒత్తిడికి గురవ్వకూడదు పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి తోడు మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవన శైలి కారణంగా రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల గుండెకు, గుండె నుంచి ఇతర అవయవాలకు వెళ్లే రక్తప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్బుల బారినపడటంతో పాటు కార్డియోమయోపతి, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించడానికి ప్రయత్నించాలి. తీసుకునే ఆహారం, జీవన శైలిని మార్చుకోవాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు జీజీహెచ్ వ్యాయామం చేయాలి ఏరోబిక్స్, యోగా, ఇతర వ్యాయామాలను జీవన శైలిలో ఓ భాగంగా చేసుకోవాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి అసాంక్రమిక జబ్బుల బారినపడకుండా ఉండవచ్చు. ప్రస్తుతం యువతలో మధుమేహం, రక్తపోటు బయటపడుతున్నాయి. ఈ దృష్ట్యా ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. రోజుకు అరగంట మించకుండా వాకింగ్, జాగింగ్, యోగా, ఇతర వ్యాయామాలు చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. స్వీయ రోగ నిరోధకత పెంచుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. కరోనా వచ్చి తగ్గినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు, ఇతర నియమాలు పాటిస్తే ఊపిరితిత్తులు, గుండె, ఇతర వ్యాధుల బారినపడకుండా ఉండగలరు. – డాక్టర్ రాంబాబు, విమ్స్ డైరెక్టర్ -
కరోనా: ఐవర్‌మెక్టిన్‌పై కీలక సూచనలు చేసిన డబ్యూహెచ్‌వో
జెనీవా: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్ మెడిసిన్ ఐవర్‌మెక్టిన్ ను తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని, కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ వెల్లడించింది.కరోనా చికిత్సలో ఐవర్మెక్టిన్ను వాడేలా చర్యలు తీసుకోవాలని గోవా ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే సూచనలు చేశారు. తాజాగా కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్‌ను వినియోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత కలిగి ఉండాలని డబ్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ మెడిసిన్‌ను కేవలం కోవిడ్‌పై జరిపే క్రినికల్ ట్రయల్స్‌లో మాత్రమే వాడాలని సూచించారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్‌పై మొత్తం 27 కంట్రోల్ ట్రయల్స్ జరిపామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద ఈ మెడిసిన్‌ను పరీక్షించామని పేర్కొన్నారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా, రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు.ప్రస్తుతం డబ్యూహెచ్‌వో తీసుకున్న నిర్ణయంతో కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ మెడిసిన్ వాడకానికి తెరపడనుంది. Safety and efficacy are important when using any drug for a new indication. @WHO recommends against the use of ivermectin for #COVID19 except within clinical trials https://t.co/dSbDiW5tCW — Soumya Swaminathan (@doctorsoumya) May 10, 2021 చదవండి: కోవిడ్ బాధితుల కోసం స్నాప్‌డీల్ సంజీవని -
ఎస్ఆర్ఎస్ నివేదికలో షాకింగ్ విషయాలు
నూఢిల్లీ: సాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్)-2018 నివేదిక ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో 20శాతం మరణాలు మధ్యప్రదేశ్‌లోనే సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అంటే దేశ వ్యాప్తంగా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారు. రెండు శాతం మరణాల రేటుతో కేరళ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. మధ్యప్రదేశ్ తరువాతి స్థానంలో ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. శిశుమరణాల రేటులో తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కేరళ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు మరణిస్తున్న చిన్నారులు సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాలకు, గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తున్న మరణాల రేటుకు చాలా వ్యత్యాసం ఉంది. అస్సాంలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 16.5 శాతం ఉండగా.. పట్టణాల్లో 6శాతం మాత్రమే ఉంది. మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు 22 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతంలో 13.4శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో శిశు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. రాష్ట్రాల వారిగా వివరాలు.. -
రికవరీ రేట్ @ 25%
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే కాలం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ముందు 3.4 రోజులుండగా, ప్రస్తుతం 11 రోజులుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, ప్రస్తుతం కేసులతో పోలిస్తే మరణాల శాతం 3.2గా ఉందని పేర్కొంది. కోలుకుంటున్నవారి శాతం కూడా గత రెండువారాల్లో గణనీయంగా పెరిగిందని, ఆ శాతం రెండు వారాల క్రితం 13.06 ఉండగా, ప్రస్తుతం 25కి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరించారు. మొత్తం కేసుల్లో 8,324 మంది, అంటే 25.19% కోవిడ్–19 నుంచి కోలుకున్నారన్నారు. ఢిల్లీ, యూపీ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, తమిళనాడుల్లో కేసులు రెట్టింపయ్యే సమయం 11 నుంచి 20 రోజులుగా ఉందని, కర్ణాటక, లద్ధాఖ్, హరియాణా, ఉత్తరాఖండ్, కేరళల్లో అది 20 నుంచి 40 రోజులుగా ఉందని వెల్లడించారు. కోవిడ్‌తో మరణించిన వారిలో 65% పురుషులని, 35% స్త్రీలని తెలిపారు. వయస్సులవారీగా మరణాలను గణిస్తే.. మృతుల్లో 45 ఏళ్లలోపు వయసున్న వారు 14%, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవారు 34.8%, 60 ఏళ్ల పైబడిన వారు 51.2% ఉన్నారని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే కేసులు రెట్టింపు అయ్యే సమయం భారత్‌లోనే ఎక్కువగా ఉందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. -
యుద్ధం వస్తే...12.5 కోట్ల ప్రాణ నష్టం
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య అణు యుద్ధమే గనక సంభవిస్తే మానవాళి కనివినీ ఎరగని స్థాయిలో ప్రాణ, పర్యావరణ నష్టం ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. అణుయుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొంది. అది రెండో ప్రపంచయుద్ధం జరిగిన ఆరేళ్లలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం ఉంటుందని పేర్కొంది. భారత్, పాక్‌ల మధ్య ఒకవేళ 2025లో యుద్ధం జరిగితే చోటు చేసుకునే పరిణామాలపై యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్, రట్జర్స్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల వద్ద సుమారు 150 చొప్పున అణ్వాయుధాలున్నాయని, అవి 2025 నాటికి 200 నుంచి 250 వరకు పెరగగలవన్నారు. భారత్, పాక్ యుద్ధం వల్ల సాధారణ మరణ రేటు ఒక్కసారిగా రెట్టింపు అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడొ బౌల్డర్‌లో ప్రొఫెసర్ అయిన బ్రయాన్ టూన్ పేర్కొన్నారు. ఈ అధ్యయన విశేషాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ అనే జర్నన్‌లో ప్రచురించారు. ‘రెండు దేశాలు భారీగా ఆయుధాలను పెంచుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో జనాభా కూడా ఎక్కువే. అదీకాక, రెండు దేశాల మధ్య అపరిష్కృత కశ్మీర్ సమస్య ఉంది. అందువల్ల యుద్ధమే వస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు’ అని టూన్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధ ప్రయోగం వల్ల వెలువడిన 16 నుంచి 36 మిలియన్ టన్నుల సూక్ష్మ కార్బన్ అణువులు కొన్ని వారాల్లోపే ప్రపంచమంతా వ్యాపిస్తాయన్నారు. ఇవి సోలార్ రేడియేషన్‌ను గ్రహించి, గాలిని మరింత వేడెక్కిస్తాయని వివరించారు. అలాగే, సూర్యరశ్మి భూమిని చేరడం 20% నుంచి 35% తగ్గుతుందని, దానివల్ల భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 2 నుంచి 5 సెల్సియస్ డిగ్రీలు తగ్గుతుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15% నుంచి 30% తగ్గుతుందన్నారు. -
కామినేనీ.. ఇదేమి..!
శిశు మరణాల రేటును 28కి తగ్గించామన్న మంత్రి ఏపీలో శిశు మరణాల రేటు 35గా పేర్కొన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అవాస్తవాలు వల్లించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు టీడీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంద సంవత్సరాలు జీవించాల్సినవారు పుట్టిన వారానికే చనిపోతున్నారు.. గత ప్రభుత్వాల తప్పిదాలే ఇందుకు కారణమని విమర్శించారు. గతంలో ప్రతి 1,000 మంది శిశువుల్లో 41 మంది మృతి చెందేవారని (శిశు మరణాల రేటు), ఇప్పుడు ఆ రేటును 28కి తగ్గించామని చెప్పారు. అయితే నెల రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ బులెటిన్ ఏపీలో శిశు మరణాల రేటును ప్రతి వెయ్యికీ 35గా పేర్కొనడం గమనార్హం. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి గత పదేళ్లలో ఒక్క నియామకమూ జరగలేదని కామినేని చెప్పారు. కానీ ఉమ్మడి ఏపీలో అంటే 2007లో అప్పటి ముఖ్యమంత్రి 4 వైద్య కళాశాలలు (రిమ్స్‌లు) ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు 3 వేల మంది నియమితులు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను ప్రైవేటుకు లీజుకు ఇస్తున్నారు. రక్తపరీక్షల నిర్వహణను సైతం ప్రైవేటుకు అప్పగించారు. దీనికి సంబంధించిన రూ.120 కోట్ల కాంట్రాక్టును ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టారు. మెడాల్ సంస్థ అద్భుతంగా పనిచేస్తోందని కామినేని కితాబిచ్చారు. -
ప్రజా రోగ్యానికి ‘చేతి’మాత్ర
ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దరిద్రరేఖ దిగువన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. యువరాజావారు కొండను తవ్వి ఎలుకను పట్టగలిగారు! ఆరోగ్య - ఆవాస అవసరాలు తీరక జనం నానా యాతన పడుతున్నారని తెలుసుకోగలిగారు. ఆయన జరిపిన మహాధ్యయనం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. దాన్ని పవిత్ర పత్రంగా అభివర్ణించింది. జనజీవన భద్రతపై మాట్లాడే ప్రణాళికను పవిత్రమైనదంటే తప్పేమీ లేదు గానీ, కాంగ్రెస్ అధినేతలు ఇన్నేళ్లుగా ఈ రంగాల్లో చేసిందేమిటన్నది ఒక ముఖ్య ప్రశ్న. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలూ, మౌలిక సౌకర్యాలూ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం-2005) అమలులో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు ప్రధాని మన్మోహన్. వైద్యఖర్చులు భరిం చలేక ఏటా 4 కోట్లమంది పేదరికం పాలపడుతున్నారని చెప్పారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ పరిస్థితిని చక్కదిద్దని కాంగ్రెస్ - ఇప్పుడు ప్రజారోగ్యానికి భరోసా ఇస్తానం టోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో యూపీఏ పనితీరును రేఖామాత్రంగా అవలోకిద్దాం. 2013 -14 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ. 37,330 కోట్లు. ఇందులో ఎన్హెచ్ఎం వాటా 21,239 కోట్లు. ఎన్ఆర్హెచ్ఎం - జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం)లను కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఏర్పాటు చేశారు. అంతకు ముందు సంవ త్సరం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.30,000 కోట్లు కేటా యించగా, అందులో ఎన్ఆర్హెచ్ఎం వాటా రూ. 20,822 కోట్లన్నారు. ఈ పథకంలో ఎన్‌యూహెచ్‌ఎంను విలీనం చేశాక అదనంగా కేటాయించింది 417 కోట్లే! ఇంత స్వల్ప కేటాయింపులతో పౌరులందరికీ ఆరోగ్యభద్రత కల్పించడం అసంభవం. 12వ ప్రణాళికలో రూ.3,00,000 కోట్లతో ఆరో గ్యసేవల్ని సార్వత్రీకరిస్తామన్న ప్రభుత్వం.. ఆ దిశగా కేటా యింపులు జరపలేదని పై లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మన విధాననిర్ణేతలు ప్రజారోగ్యాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించబూనుకున్నారని భావించాల్సి వస్తోంది. ప్రైవేటు రంగం గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి వెనుకబడిన - మారుమూల గ్రామాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడదు. ప్రభు త్వరంగంలో తగిన పెట్టుబడులు పెట్టడం - ఆరోగ్య పథ కాల్ని నిజాయితీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజ లు మెరుగైన ఆరోగ్యసేవలు పొందేందుకూ ఆర్థిక భారాల నుంచి బయటపడేందుకూ వీలవుతుంది. కానీ ఈ విష యంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజారోగ్యానికి సంబంధించిన పలు లక్ష్యాలతో ప్రారం భమైన ఎన్ఆర్హెచ్ఎం మాతా శిశు మరణాలపైనే రవ్వంత దృష్టి సారించింది. 2005 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోద వుతున్న మాతృ మరణాల్లో 20శాతం పైగా భారతదేశంలో చోటు చేసుకున్నవే. ప్రసవానంతర నాలుగు వారాల్లో నమో దయ్యే మరణాల్లో 31 శాతం మన దేశానివే. ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మాతా శిశు మరణాలు తగ్గించాలన్న సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలకూ కట్టుబడింది. ఈ నేపథ్యంలో - దరిద్రరేఖ దిగు వన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇం దుకోసం 2005లో ‘జననీ సురక్షా యోజన’ పథకం ప్రారం భించింది. గర్భిణులకు రూ.1400 ఇవ్వడం ద్వారా వారిని ఆసుపత్రి ప్రసవాల వైపు మళ్లించబూనుకుంది. నగదు బది లీతో ముడివడిన అంశం కాబట్టి - ఈ అంశంలో కొద్ది ఫలి తాలు కనిపిస్తున్నాయి. 2005లో 50శాతంగా ఉన్న ఆసుపత్రి ప్రసవాలు 2012 నాటికి 70శాతానికి పెరిగాయి. అయితే, పేదరికం - పోషకాహారలోపం కారణంగా మాతా శిశు మర ణాలు నిర్దేశించుకున్న స్థాయిలో తగ్గడం లేదు. ప్రసవానం తర నాలుగు వారాల్లో సంభవించే శిశు మరణాలు పేద కుటుంబాల్లో అధికంగా ఉంటున్నాయి (వెయ్యికి 56). 2004-06 మధ్య 254 (ప్రతి లక్ష మందికి)గా ఉన్న మాతృ మరణాల రేటు 2012 నాటికి 178కి తగ్గింది. శిశు మరణాల రేటు 2011 నాటికి 44కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన రోజునే చనిపోతున్న శిశువుల్లో 29 శాతం మంది మన దేశ శిశువులే. మెరుగైన ఆరోగ్య సేవలు లభిస్తే తొలిరోజు మర ణాల్లో సగానికి సగం తగ్గించవచ్చు. కానీ అనవసర ఆర్భా టం చేయడం తప్ప వీటిపై శ్రద్ధ పెట్టని మన పాలకులు - ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి తమ అజెండా అంటున్నారు. ఈ అజెండాకు కట్టుబడే ప్రభుత్వాలు ఏవైనా ముందు సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. పరిశుభ్రమైన నీరూ, పోషకాహారమూ, పారిశుధ్యమూ, ఆరోగ్య - ఆవాస - విద్యా సౌకర్యాలతోనే ఆరోగ్యకర సమాజం నిర్మితమవుతుందని గుర్తించాలి. వి.ఉదయలక్ష్మి