సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేసే ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (ఎయిమ్స్)కు వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శ్రీనివాస్ సోమవారం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిమ్స్‌కు రూ.200 కోట్లు విడుదల చేస్తామని, భూముల పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఈ నెల 23లోగా పంపుతామని నడ్డా హామీ ఇచ్చారన్నారు.