
అమరావతిలో యోగా కేంద్రం
న్యూఢిల్లీ : టీటీడీ, పతంజలి సహకారంతో అమరావతిలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కామినేని శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ... బాబా రాందేవ్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించామని చెప్పారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య లోపానికి గత ప్రభుత్వాలే కారణమని కామినేని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో శానిటేషన్ విధానం తీసుకొస్తామని కామినేని స్పష్టం చేశారు.