వచ్చే నెలలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన: కామినేని | in the next month foundation stone for AIIMS | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన: కామినేని

Published Sun, Dec 21 2014 1:37 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

in the next month foundation stone for AIIMS

సాక్షి, విజయవాడ బ్యూరో: జనవరి నెలాఖరుకల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు.  ఎయిమ్స్ స్థల పరిశీలనకు వచ్చిన బృందానికి శానిటోరియం ఆసుపత్రి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్‌ఐడీసీ) ఎండీ రవిచంద్ర నిపుణుల బృందానికి పూర్తి వివరాలను అందించారు. అనంతరం కమిటీ ఒక హోటల్‌లో మంత్రితో సమావేశమై, ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది. ఆ తర్వాత మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement